Tuesday, 21 February 2012

నయన తార

యాంకర్‌
అందం అంటే... ఎలా వుండాలంటే... ఆలోచించకుండా... నయనా తారలా అంటే... బావుంటుందేమో... నిలు వెత్తు అందం నయనది... అసలు దేవుడు చాలా తీరికగా మంచి మూడ్‌తో నయనను తీర్చిదిద్దాదేమో అన్పిస్తుంది. చంద్రుడి కైనా మాచ్చలున్నాయేమోగానీ... తనది మచ్చలేని అందం... చూడగానే గుండె ఝళ్లుమనే అందం... ఈ అందంకు నేడు పుట్టిన రోజు.

యాంకర్‌.1
వెన్నెల్లో వనదేవతను ఎప్పుడైనా చూశారా... ఆ అవకాశం లేకపోతే నయనతారను చూడాండి తనో నడిచే దేవత నయనతార ఎంత సొగసరి ..తనకోసమే సినిమాలకే వెళ్ళే వాళ్లున్నారంటే అబద్ధం కాదు.

యాంకర్‌.2
బెంగుళూరు... అందంగా వుంటుంది. సిటీ ఆఫ్‌ గార్డెన్స్‌గా... పిలువ బడే బెంగుళూరులో... విరిసిన అందమైన పుష్పం నయనా తార.

యాంకర్‌.3
కొందరికి అన్ని కలిసొస్తాయి... అలాగే నయనా తారకు చంద్రముఖితో...  ఎక్కడలేని పేరొచ్చింది. రజినీ కాంత్‌ సరసన ఈ చిత్రంలో నయన అమాయకంగా కన్పించినా ప్రేక్షకులకు అందంగా కన్పించింది.

యాంకర్‌.4
నయన్‌ ప్రేక్షకుల నయనా నందం కోసమే పుట్టిందేమో అన్పిస్తుంది. గజినీ చిత్రంలో తన డాన్స్‌ చూస్తూంటే కుర్రకారు గుండెల్లో డైనమైట్స్‌ పేలతాయి.

యాంకర్‌.5
అసలే అతను నాగార్జున... అందులోనూ... మన్మధుడు... ఆడపిల్లలయితే... ఇక చెప్పాల్సిందేముంది. అతను బాస్‌ అయ్యాడు ఆమె... బాస్‌ I Love You అంది... అయితే ఆ మాట కాస్త లేట్‌గా అంది. అందంగా వున్న వాళ్లకు అహంకారం కూడా ఆభరణమే కదా.

యాంకర్‌.6
ఒక నటికి అవకాశాలు ఎలా వొస్తాయి. సినిమాలు హిట్‌ అవ్వాలి... అయితే నయన్‌కు ఈ సూత్రం వర్తించదు... సినిమా హిట్టా ఫట్టా అన్నది అవసరం లేదు... వెన్ననూ వెన్నెలనూ పాలలో కలిపి తయారు చేసినట్టుండే... నయన తారకు అవకాశాలు వాటింతట అవే వొచ్చాయి.

యాంకర్‌.7
నయన తార అందంగా వుంటుంది. అందులో డౌట్‌లేదు... అందుకేనేమో అందరు హీరోలతో... వరుసగా... సినిమాలు చేసింది. అదుర్స్‌ అన్పించుకుంది. జూనియర్‌ N.T.R. తో అయినా బాలయ్యతో అయినా సరే నయన జోడి అదురుతుంది.

యాంకర్‌.8
నయనతార సీతమ్మగా నటించినా అంతే సౌమ్యంగా వుంటుంది. రాధమ్మగా నటించినా అంతే సరదాగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నయనతార అందంగా ఉంటుంది. కాదు...కాదు... అద్భుతంగా వుంటుంది.

యాంకర్‌.9
నయన తార అందం ఎందర్నో  పిచ్చివాళ్ళను చేసింది ...కొందర్ని కవుల్ని చేసింది ...
ఈ అంశాల రాసి ప్రభు దేవా ప్రేమలో పడింది ..అయితే త్వరలో  సినిమాలకు గుడ్ బై చెప్తుందట.. ప్చ్ .....బాడ్ న్యూస్

closing part:-
 నువ్వొక అద్భుతం.....నయన నువ్వొ.....అపురూపం...నయన్‌...Happy Birth Day To You.

No comments:

Post a Comment