యాంకర్.1
ఆవిడ పేరు వింటే... రేలంగయినా... రమణా రెడ్డియినా ఉలిక్కి పడాల్సిందే... సావిత్రయినా... జమునయినా... ఆమెచేతి అట్లకాడ బాధితులే... అంతెందుకు... NTR,ANR, లాంటి స్టార్‌లకు సైతం స్టార్‌లు చూపించిన...ఘనత ఆవిడది.. అందరూ ప్రేమగా గయ్యాళి అని పిల్చుకునే ఆవిడ పేరు...సూర్యకాంతం. ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త వర్దంతి నేడు... పేరుకు ముందు గయ్యాళి అని ఉన్నా ఆమె మనసు వెన్న.
యాంకర్.2
సూర్యకాంతం ఎంత అందమైన పేరు... అయితే ఆ పేరు వింటే గంప గయ్యాళి... గరిటితో వాతలు పెట్టే... ఆంధ్రుల అత్తగారైన సూర్యకాంతమ్మేకళ్ళ ముందు కన్పిస్తారు. ఆవిడ అరుపులు ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటున్నాయి. ఇంతలా ఒక పాత్రను ఉన్నత శిఖరాల పై నిలబెట్టిన వారు సినిమా చరిత్రలో మరొకరులేరు.
యాంకర్.3
1924 అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడలో జన్మించారు. సినిమాలంటే సూర్యకాంతానికి ఇష్టంగా వుండేది. హిందీ సినిమాలంటే మహా ఇష్టపడే ఈవిడ నటించిన మొదటి చిత్రం... నారద నారది.
యాంకర్.4
సంసారం చిత్రం... రావటం తెలుగు వారి అదృష్టంగా భావించాలి. ఈ చిత్రంతోనే తొలిసారిగ గయ్యాళి అవతారం ఎత్తిన సూర్యకాంతం గారు. ఆ పాత్రను ఇరగదీయటంతో ఇక అత్తగారు గయ్యాళి అనే ట్రేడ్ మార్కొచ్చింది.
యాంకర్.5
సూర్యకాంతం గారు నటిస్తారా... అసలావిడకు నటించటం వొస్తుందా... అంటే... రాదనే చెప్పాలి. ఆవిడ జీవిస్తుంది ఏ హాలివుడ్ నటులకూ అందని సహజ నటన ఆవిడది. సావిత్రి... జమున..లను ఎన్నో చిత్రాల్లో చీపురు కట్టలతో దేహశుద్ధి చేసింది. థియేటర్‌లో ఆవిడను తిట్టని వారుండే వారు కాదు. ప్రేక్షకుల తిట్లే నటీ నటులకు పెద్ద అవార్డులు
యాంకర్.6
NTR, ANR, SV రంగారావు, సావిత్రి ,జమున ,ల్లాంటి హేమా హేమీలున్న చిత్రం... అందులో సూర్యకాంతం గారి పాత్ర గుండమ్మ కథ అని పేరు పెట్టారంటే... ఆవిడకు ఇంతకన్నా గౌరవం... పాపులారిటీ ఏముంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు వారు మరువగలరా...?
యాంకర్.7
సూర్యకాంతం గారు నటించిన పాత్రల్లో ఎక్కడా అసహజత్వం... కన్పించదు... కృతకంగా అన్పించవు... చాడీలు చెప్పినా... అరిచినా... చేతులు తిప్పూతూ... కోడళ్లను రాచి రంపాన పెట్టినా... భర్తల్ని కుక్కిన పేనుల్లా అణిచి వేసినా ఆవిడకు మాత్రమే చెల్లుతుంది.
యాంకర్.8
రేలంగి గారితో జోడిగా వుంటే.. రేలంగోడు... కిక్కురు మనకుండా పడుంటాడు. రమణా రెడ్డి గారితో నటిస్తే ఈవిడ అరుపులకు ఆయన శరీరం.. తుఫానులో గడ్డిపోచలా కపించిపోతుంది. ఇక పెద్దాయన S.V రంగారావు గారి పక్కన నటిస్తే ఈ విడ గయ్యాళి తనాన్ని ఆయన పెద్దరికంతో జయిస్తూ గుంభనంగా వుంటాడు... సూర్యకాంతం గారి చలువతో అత్తగారి పాత్రకు ఆకాశమంత గుర్తింపోచ్చింది.
యాంకర్.9
సూర్యకాంతం గారి గురించి ఎన్ని చెప్పినా.. ఒకటి మాత్రం గుర్తు చేసుకోకపోతే అసంపూర్తి అవుతుంది. ఆవిడ నటించటం మొదలెట్టాక... ఆ గయ్యాళి తనం చూసి అందరూ..అబ్బో తనో పెద్ద సూర్యకాంతం అని గయ్యాళి వారిని అనటం మొదలైంది... ఆవిడ పుణ్యమాని ఆంధ్రదేశంలో సూర్యకాంతం అనే పేరు ఇప్పటీకీ ఎవరూ తమ పిల్లలకు పెట్టడం లేదంటే ఆవిడ నటన ఎంత ప్రభావమ్ చూపిందో తెలుస్తుంది.
యాంకర్.10
పాత్రలు గయ్యాళివే అయినా... సూర్యకాంతం గారి మనసు వెన్నపూస అని అంతా అనే వారట. అందరికీ భోజనాలు పెట్టటం పండుగలకు పర్వదినాలకు, అందరీనీ ఇంటికీ ఆహ్వానించి బట్టలు పెట్టటం తోటి వారికి సాయపడటంలో సూర్యకాంతంగారు ముందుండే వారట. 1950లో పెద్దిబొట్ల చలపతి రావును వివాహం చేసుకుంది. చలపతి రావు గారు హైకోర్టు జడ్జిగా పనిచేసేవారు.
యాంకర్.11
నాగిరెడ్డి చక్రపాణిల చిత్రాలు గమనిస్తే అందులో సూర్యకాంతం గారి పాత్రలేని చిత్రాలు బహు అరుదుగా కన్పిస్తాయి. ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించి... ఆంధ్రుల అత్తగారిగా గయ్యాళి పాత్రలకు స్టాండర్డ్‌గా నిలిచిన సూర్యకాంతం గారు 1996 డిసెంబర్ 17వ తేదిన సూర్యకాంతం గారు స్వర్గస్తులయ్యారు... ప్రస్తుతం అవిడ స్వర్గంలో సేదతీరుతున్నారేమో... అమ్మా... సూర్యకాంతం గారూ నమోనమామి.

No comments:
Post a Comment