Tuesday, 21 February 2012

ఘంటసాల

యాంకర్‌
కొండ మీద గుడిగంట మోగింది. ఎంత శ్రావ్యంగా... విన్పించిందో అంతకన్నా శ్రావ్యంగా... మనసు పులకించేలా... తనువు... తరించేలా భగవద్గీత విన్పిస్తోంది ఆ స్వరం పేరు ... ఘంటసాల. తరతరాల తరగని సంపద. ఆ స్వరం... సుమధురం. స్వరాల వరాల ఘంటసాల పుట్టిన రోజు నేడు.

యాంకర్‌.1
ఘంటసాల గారు... తెలుగు వారికి ఆ దేవుడిచ్చిన వరం. ఆ స్వరంలో ఎంత మాధుర్యం... ఆ సరిగమలే... పులకించేవేమో... ఘంటసాల గారి పాటలు వింటే మనసు రెక్కలు తొడుక్కుటుంది... మరోలోకంలో విహరిస్తుంది.

యాంకర్‌.2
తండ్రి చిన్నతనంలోనే చనిపోతే రోజుకు ఒక్కపూట తినటానికి సైతం ఇబ్బంది పడ్డారు... సముద్రాల రాఘవాచార్యులతో పరిచయం ఘంటసాల గారి జీవితాన్ని మలుపు తిప్పింది.

యాంకర్‌.3
చిత్తూరు నాగయ్య, బి.యన్‌. రెడ్డి గారు ఘంటసాల గారికి స్వర్గసీమ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశం కల్పించారు. ఆ పాటను భానుమతి గారితో భయంగా కలిసి పాడారట... తొలి పాటకు ఆయన నూట పదహారు రూపాయల పారితోషికం అందుకున్నారు. ఆ తరువాత రత్నమాల చిత్నానికి సహయ సంగీత దర్శకుడిగా అవకాశం కలిగింది.

యాంకర్‌.4
ఘంటసాల గారు చేసినా చిత్రాలన్నీ ఆణిముత్యాలో... ఆయన చేసినందుకే అని ఆణిముత్యాలయ్యాయో... తెలీదుగానీ, మాయబజార్‌ చిత్రంలో ఎంత కమ్మటి పాటలు పాడారో. మాయబజార్‌ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. మాయబజార్‌లో సంగీతం అద్భుతం.

యాంకర్‌.5
అక్కినేని గారికి దేవాదాసు చిత్రం ఎంత పేరు తెచ్చందో ఆ చిత్రంలో అందరూ... అక్కినేని గారి నటనను ప్రశంసిస్తే... అక్కినేని గారికి మాత్రం ఘంటసాల గారి పాటలే నచ్చాయట ఆ పాటల్లో విషాదమెంత బాగా పలికించారనీ.

యాంకర్‌.6
ఘంటసాల గారు... ఎంత ఎదిగినా తాను నడిచొచ్చిన దారిని మర్చిపోలేదు. సాధ్యమైనంతగా అందరికీ సాయపడే వారట... నాడు ఉ తల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె వాత్యల్సపూరితమైన భిక్షనాకు అష్ట్తశ్వర్యాలతో సమానం.

యాంకర్‌.7
ఘంటసాలగారు తెలుగు చలన చిత్ర రంగానికి ఎంతో సేవ చేశారు ఆ మాధుర్యం. ఇంకే స్వరంలోనూ కనిపించదు వినిపించదు ఆయన పై గౌరవార్ధం... తపాలాబిళ్లను విడుదలచేశారు. ఘంటసాలగారి జన్యదినం తెలుగు పాటకు జన్మదినం... సంగీతం మురిసే పర్వదినం...  స్వర్గంలో ఆయన పాడుతాతీయగా చల్లగా అంటూ మధురంగా పాడుతుతున్నారేమో. స్వరాలశాల ఘంటసాల గారికి మరో సారి జన్మదిన శుభాకాంక్షలు.

No comments:

Post a Comment