Tuesday, 21 February 2012

కొండ వలస లక్ష్మణ రావు

యాంకర్‌
బక్క పలచని రూపం...గట్టిగా గాలి వీస్తే కనిపించడు. గంభీరమైన గోంతూ కాదు... కీచుగొంతుతో... ఐతే... ఓకే... అంటూ..కామెడీలో కొత్త... బాటపట్టాడు. ఆ బాటసారి పేరు లక్ష్మణరావు... ఇలా అంటే అందరికీ తెలియదేమో... కొండ వలస లక్ష్మణ రావు అంటే అయితే ఓకే అంటారు. ఈ కామెడీ కొండకు నేడు పుట్టిన రోజు.... Happy Birth Day బంగారు కొండ.

యాంకర్‌.1
అతడో నాటకాల రాముడు. నాటకాలంటే పిచ్చి, వెర్రి , ఇంకా, వగైరా...వగైరా... ఎంత పిచ్చంటే నాటకాల్లోనే జస్ట్‌ 378 అవార్డుల్ని అందుకున్నాడు... అయితే అతని కోసం... ఓ తల్లి ఎదురు చూస్తోంది. ఈ తల్లి పేరు సినీకళామ తల్లి.

యాంకర్‌.2
ఓ రోజు ఎప్పట్లాగే నాటకం ఆడ్తున్నాడు మాములుగానే... ప్రేక్షకులు చూస్తున్నారు... అయితే ఆ ప్రేక్షకుల్లో ఒకతను మాత్రం మాములుగానే చూస్తున్నా అతను మాములోడు కాదు. ఆంధ్ర ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టించిన వాడు... అందరూ అతన్ని డైరెక్టర్‌ వంశీ అంటారు.

యాంకర్‌.3
చినుకు  ఆల్చిప్పలో పడితేనే అది ముత్యమౌతుంది. కామెడియన్‌ లక్షణాలున్న బాడీ... వంశీ చేతిలో పడితే అతను కబ్బాడి ఆడుకోడా...? జరిగింది అదే... అవును... జౌను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు చిత్రంలో పోట్టిరాజుగా కొండవలస బండ భార్యతో కొండంత కామెడీని పండించాడు... ప్రేక్షకుల చేత ఐతే ఓకే అన్పించాడు.

యాంకర్‌.4
అమితాబ్‌ బచ్చన్‌ గొంతు బాలేదని.... వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించాలని అనుకున్నారట. ఇదే విషయం రావుగోపాలరావు గారినీ ఇలాగే అన్నారు... అదేంటో... కొండవలసనూ అదే అన్నారు... అయితే మనిషి ఒక్కపలచనేగానీ... సంకల్పం కొండంత... చివరికి ఓ మ్యానరిజం పట్టుకున్నాడు గెలిచాడు.

యాంకర్‌.5
కొడుకు కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాడు. ఆ తరువాత తండ్రి కామెడియన్‌ అయ్యాడు... సిన్‌ రివర్స్‌గావున్నా... ఆల్‌ ఈజ్‌ వెల్‌ కామెడియన్‌గా... కొండవలస కొండంత ఎత్తుకు ఎదిగాడు.

యాంకర్‌.6
మాట విరుస్తాడు... మనిషిలో కామెడీ పూనకం పూనుతుంది. టెన్షన్‌పడ్డా టెన్షన్‌ పెట్టినా ఆ బాడీ ల్యాంగ్వేజ్‌... కామెడీగా పరివర్తనం చెందుతుంది... మీసాలు దువ్వినా తోడగొట్టినా... సరే... నవ్వులే కురుస్తాయి.

యాంకర్‌.7
కొండవలసను చూస్తే రైటర్‌లకు ఐడియాలోస్తాయేమో. ఒక్కో చిత్రంలో ఒక్కో టైపు క్యారెక్టర్‌లు వేస్తున్నా తన ఒరిజనల్‌ క్యారెక్టర్‌ మాత్రం అణిగిమణిగే వుంటాడని అంటారు... ఇది కొండవలస సంస్కారం బంగారు కొండా Happy Birth Day ... ఇంగ్లీష్‌లో అయితే ఓకేనా.

No comments:

Post a Comment