Tuesday, 21 February 2012

పవన్‌ కళ్యాణ్‌

యాంకర్‌.1
హాయ్‌ అతనొక సంచలనం అతనొక పజిల్‌ ఏం మాట్లాడినా ఏం చేసినా వెరయిటీనే అతనే పవన్‌ కళ్యాణ్‌ పేరుకు మెగాస్టార్‌ తమ్ముడైనా... పవన్‌ కళ్యాణ్‌ది మరో లోకం ప్రేక్షకులను రంజింప చేయటంలో డిఫరెంట్‌ వే ఈ రోజు పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే పవన్‌ స్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుదాం.

యాంకర్‌.2
అన్న పెద్ద స్టార్‌ మెగాస్టార్‌ సుప్రీం హీరో పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీఅందరి సినిమాల్లో సాదాసీదా లవ్‌స్టోరీతో మొదలైంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. మొదటి చిత్రం ఆ అబ్బాయి..పవన్‌ కళ్యాణ్‌ అయితే ఆ అమ్మాయి పేరు సుప్రియ నాగార్జున మేనకోడలు. ఈ చిత్రానికి e.v.v సత్యానారాయణ దర్శకుడు అయితే ఈ చిత్రం ఆశించినంత ఆడలేదు.

యాంకర్‌.3
1973 సెప్టెంబరు రెండున మొగత్తారులో జన్మించిన పవన్‌ కళ్యాణ్‌కు నమ్మకాలు ఎక్కువ అంటారు. ఈ కోణంగానే కళ్యాణ్‌బాబు కాస్తా పవన్‌ కళ్యాణ్‌ అయ్యాడు మార్షల్‌ ఆర్స్ట్‌లో మంచి ప్రవేశం ఉన్న ఇతనికి పవన్‌ అనే పేరు బిరుదుగా వొచ్చి చేరింది. అప్పట్నించే తన దశ మారింది.

యాంకర్‌.4
పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనా విధానం అంతా ఇప్పుడున్న తరం హీరోల కన్న చాలా డిఫిరెంట్‌గా వుంటుంది. అసలు డిఫరెంట్‌ అనే పదమే సరిపోదేమో తమ్ముడు చిత్రంలో పుల్‌ఫ్లడ్జ్‌గా ఓ ఇంగ్లీష్‌ పాటను పెట్టి దాన్ని అద్భుతంగా హిట్‌ చేశాడు అదీ దాదాపుగా పన్నెండేళ్ల క్రితం.

యాంకర్‌.5
చదువు తనకు అబ్బలేదని స్వయంగా చెప్పుకునే పవన్‌ కళ్యాణ్‌ ఇంటర్‌ వరకూ చదివాడు మార్షల్‌ ఆర్ట్స్‌లో కింగ్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌కు ఈ విద్య సినిమాల్లో చాలా ఉపయోగపడ్తోంది. సినిమాల్లో తన ఫైట్స్‌ తానే కంపోజ్‌ చేసుకునే కళ్యాణ్‌ చిరు సినిమాల్లో కొన్నింటికీ ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు.

యాంకర్‌.6
తొలి చిత్రం నుండి ఇప్పటి వరకూ తీన్‌మార్‌ దాకా పదిహేనేళ్లలో మొత్తం కలిపి చేసిన సినిమాలన్నీ పదిహేనే కావటం విశేషం దీని ద్వారా తరెంత లేట్‌గా ఆలోచించి సినిమాలు చేస్తాడో తెలుస్తోంది. అందులోనూ ఒక సినిమా కథ మరో సినిమాకు అస్సలు లింక్‌ అవ్వదు.

యాంకర్‌.7
తొలిప్రేమ పవన్‌కు ఫస్ట్‌ సూపర్‌ హిట్‌ అయితే అంతకు ముందు వొచ్చిన సుస్వాగతము హిట్టే ఆ తరువాత పూరీతో బద్రి ఇలా అన్నీ డిఫిరెంట్‌ కథలతో వొచ్చినవే కొత్తదానానికి స్వాగతం పలికే పవన్‌ కళ్యాణ్‌ బద్రి సినిమా పూరిజగన్నాధ్‌కి తొలి చిత్రం ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన రేణూదేశాయ్‌ని పవన్‌ తరువాత పెళ్లాడాడు.

యాంకర్‌.8
ఖుషీ చిత్రం పవన్‌ సినిమా చరిత్రలో చరిత్ర సృష్టించింది ఈ సినిమాలో తనది చాలా క్యాజువల్‌గా కన్పించే రోల్‌ అసలు యాక్షన్‌లా కాకుండా ఈజీగా నటిస్తాడు పవన్‌కు శ్రీకాకుళం యాసలో ఉన్న జానపదాలంటే ఎంతో ఇష్టం. ఇదొక సెంటిమెంట్‌గా వారి తన ప్రతి సినిమాలో ఎక్కడో ఓక చోట ఇవి పెడ్తూంటాడు.

యాంకర్‌.9
జానీ చిత్రం తో పవన్‌ కళ్యాణ్‌ డైరెక్టర్‌ అవతారమెత్తాడు కొత్త గెటప్‌లో కన్పించాడు డబ్బింగ్‌ లేకుండా డైలాగ్స్‌ లైవ్‌ రికార్డింగ్‌ చేశారు ఇంకెన్నొ ప్రయోగాలు చేసి పవన్‌ తన క్రీయేటి విటీ దాహం తీర్చుకున్నాడు అయితే ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాకుపోవటం వేరే సంగతి చిత్రం మొత్తంలో పవన్‌ తపన మాత్రం కన్పిస్తుంది.

యాంకర్‌.10
పవన్‌ కళ్యాణ్‌ చిత్రాల టైటిల్స్‌ బహు విచిత్రంగా కొత్తగా వుంటాయి. ఈ టైటిల్స్‌ పెట్టటంలోని క్రియేటివిటీ తన కొడుక్కు పేరు పెట్టటంలోనూ పవన్‌ చూపించాడు పవన్‌ కళ్యాణ్‌ అబ్బాయి పేరు అకీరానందన్‌ అని పేరుపెట్టారు.

యాంకర్‌.11
గుడుంబా శంకర్‌, బాలు, తరువాత త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన జల్సా చిత్రం మళ్లీ పవన్‌ కళ్యాణ్‌ బాడీ ల్యాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయింది. ఆతరువాత చిత్రాలన్నీ నిరాశపరిచినా పవన్‌ క్రేజ్‌ను మాత్రం తగ్గించలేక పోయారు.

యాంకర్‌.12
పవన్‌ కళ్యాణ్‌ ఏం చేసినా సంచాలనమే హిట్‌ ఫ్లాపూలతో సంబంధం లేని వ్యక్తి తన వ్యక్తిత్వం ఎలా వుంటుందో అలాంటి కథలే ఎంచుకునే పవన్‌ ముందు ముందు మరిన్ని ప్రయోగాలు చేయాలని ఆశిస్తూ మరో సారి ఈ పవన్‌ స్టార్‌కు బర్త్‌డే విషెష్‌ తెలుపుతూ బై...బై...

No comments:

Post a Comment