Tuesday, 21 February 2012

దేవిశ్రీ ప్రసాద్‌

దేవి ప్రసాద్‌
నమస్కారం,

1.యాంకర్‌ :తెల్లవారు జామున పచ్చిగడ్డి పై రాలి ముత్యల్లా మెరుస్తున్న మంచు బిందువులు కొకిలల ఝంకారాలను అస్వాదించడం మానేశాయి. శుక్లపక్ష వెన్నెల రాత్రిలో కలువులు పిల్లతిమ్మెరల జివ్వమనే శబ్దానికి నర్తించడం మానేశాయి. ఆది ప్రణవ రూపమైన ఓంకారం నుంచి పుట్టిన సంగీతాన్ని అహ్లాదకరంగా వైవిధ్యహభరితంగా అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాల వైపు తమ దృష్టిని మరల్చి ఆడి, పాడి ప్రకృతికి మరింత శోభను తీసుకు వచ్చాయి. సప్త స్వరాలతో ప్రయోగాలు చేస్తున్న దేవి శ్రీ కి బర్త్‌ డే విషెస్‌ అందించాయి. మనం కూడా Music రైజింగ్‌ స్టార్‌ దేవికి బర్త్‌డే విషెష్‌ అందించి ఆయన సంగీత ప్రస్ధానన్ని స్వర మాధురుని అస్వాదిద్దాం పదండి.

2.యాంకర్‌ :లిరిక్‌ రైటర్‌గా, మ్యూసిక్‌ కంపోజర్‌గా గాయకుడిగా, కొరియోగ్రాఫర్‌గా ఇలా సంగీతానికి సంబంధించిన అన్ని అంశాల్లో రాణిస్తూ, సత్యానంద్‌ తనయుడిగా సినివారసత్వాన్ని కొనసాగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ తెలుగు సినీ సంగీత అగ్రగణ్య దర్శకులలో ఒకరు. చిన్నతనం నుంచి ఇళయరాజా సంగీతాన్ని విని నరానరాల్లో జీర్నించుకున్న దేవిశ్రీ ముండాలిన్‌ ప్లేయర్‌ శ్రీనివాస్‌, కిరవాణిల దగ్గర శష్యురికం చేసి కొడిరామకృష్ణ దర్శకత్వంలో ఎమ్‌.ఎస్‌.రాజు నిర్మాతగా వచ్చన దేవి చిత్రంతో తొలిసారి వెండితెరపై తన బాణీ విన్పించారు. ఈ చిత్రంలోని పాటలన్ని బాగుంటాయి.ముఖ్యంగా కుంకమపూల తోటలోకులికే ఓ కుమారి.

3.యాంకర్‌ :శాస్రీయ సంగీతం హిందుస్ధాని సంగీతం జానపధం వెస్ట్రన్‌ సంగీతం ఎదైనా దానికి మూలం ప్రకృతియే. ఆ ప్రకృతి అందాలను పట్టి దానికి సృజనాత్మకతను జొడించి స్వరాలు కూర్చి, రాగయుక్తంగా లయబద్దంగా సినీ అభిమానులకు సంగీతాన్ని అందిస్తున్న దేవికి బ్రేక్‌ ఇచ్చిన చిత్రం ఆనందం. ఈ చిత్రంతోనే ఆయన స్వయంగా పాటలు రాసి, స్వరాలు కూర్చి, పాడడం మొదలు పెట్టారు. ప్రేమంటే ఏమిటంటే ఎట్టాగచెప్పమంటే ఎట్టాగా చెప్పెది మామ.

4.యాంకర్‌ :సినిమా పాటలను ట్యూన్‌ చేయడానికి మలేషియా సింగపూర్‌,బ్యాంకాంగ్‌ లాంటి ప్రదేశాలకు వెళ్ళకుండా, అందుబాటులోవున్నవాయిద్యాలతో వినసొంపైన సంగీతాన్ని అందించే దేవి సాహిత్యానికే మొదటి ప్రాధాన్యతను ఇస్తారు. ఇప్పటి వరుకు ఆయన చేసిన చిత్రాల్లో ఏ ఒక్క పాటని కూడ ట్యూన్స్‌ డామినేట్‌ చేయలేదు. ఆ పాట భావాన్ని మింగేయలేదు, స్వయంగా ఆయన లిరిక్‌ రైటర్‌ కావడం మూలంగా ఇలాంటి ప్రత్యేక శ్రద్దను తీసుకుంటారని సినీ విమర్షకుల అభిప్రాయం. ఆకాశం తన రెక్కలతో నను కప్పుతూ వుంటే భూలోకం నన్ను నిద్దుర పుచ్చాలి. ఎంత మంచి ఉత్పేక్ష అలంకారమిది. ఇలాంటి ఎన్నో పాటలకు దేవి లిరీక్స్‌తో పాటు ట్యూన్స్‌ కట్టడం విశేషం.

5.యాంకర్‌ :ఒక మ్యూజిక్‌ Director పాటకు ట్యూన్‌ కట్టాలంటే ఆ సంధర్భాన్ని ఉహించుకొవాలి, అప్పుడు ఆయనలో కలిగిన ఉద్వేగాలను సరిగమపదనిసలతో జోడించాలి శృతి, స్వరం, రాగం, తాళం తప్పకుండా జాగ్రత తీసుకొవాలి. ఒక సినిమాలో ఆరు పాటలు వుంటే ఆ ఆరు పాటల ట్యూన్స్‌ ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా వైవిధ్యభరితంగా సమకూర్చాలి. ఇలా తన ప్రతి చిత్రానికి Different ట్యూన్స్‌ ఇస్తూ, సంగీత సినీ ప్రపంచంలో వెలిగిపొతున్న దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించిన ఖడ్గం, మన్మధుడు, వర్షం, ఆర్య, జల్సా లాంటి చిత్రాలు మ్యూజికల్‌ హిట్‌ సాధించాయి. ఎందుకంటే ఆయన సప్తస్వరాలకు ఉద్వేగాలను జొడిస్తాడు కాబట్టి.

6.యాంకర్‌ :కొత్తవారిని పొత్సహంచడంలో, ముఖ్యంగా సినీ నటినటులను గాయకులుగా పరిచయం చేయడంలో దేవిశ్రీ తనదైన శైలిని చూపించారు. చిరంజివి, ఎన్‌టిఆర్‌, సిద్దార్ద్‌, చార్మీ, మమతామెహన్‌, శృతిహాసన్‌లతో పాటలు పాడించి సినీ అభిమానులకు దగ్గరయ్యారు, ఇలా తన ప్రతి చిత్రంలోను దేవి ఎదో ఒక ప్రయోగం చేసి మ్యూజికల్‌ హిట్‌ సాధిస్తాడు.

7.యాంకర్‌ :సాంప్రదాయవాయిద్యాలను వాడకుండా కేవలం వాడిపారేసిన డబ్బాలతో ఎంతో శ్రమించి, సంగీతానికి అపశ్రుతి కలగకుండా రాఖీచిత్రంలో ఓ పాటకు దేవి సమకూర్చిన స్వరాలు ఆయన కెరిర్‌లోనే ధిబెస్ట్‌ Experment అని చెప్పవచ్చు, ఈ రకంగా ఆయన సంగీకళాకొవిదుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు.

8.యాంకర్‌ :దేవిశ్రీ ప్రసాద్‌ అన్నిరకాల పాటలను కంపోజ్‌ చేయగలడు, వర్షం చిత్రంలో ఆయన అందించిన ట్యూన్స్‌ జీవనప్రయాణంలో హృదయాన్ని తాకి వారికి పరవశాన్ని ఇస్తాయి. నీటిములై నన్నుగిల్లి వెళ్ళిపోకే మల్లేవాన, జంటనల్లే బంధవుల్లే వుండిపొయే వెండివాన.

9.యాంకర్‌ :దేవి శ్రీ చేపిన రింగా రింగా ఐటం ఎంత పాపులర్‌ అయిందో మన కందరికి తెలుసు ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనె కాకుండా, దక్షణాది, ఉత్తరాదిలోనూ సంచటనం సృష్టంచింది, ఈ పాటను విని అశ్చర్యపొయిన సల్మాన్‌ఖాన్‌, రెడి చిత్రంలో ఈ ట్యూన్స్‌ను వాడుకోవడం విశేషం.

10.యాంకర్‌ :వర్షం, నువ్వస్తానంటే నేను వద్దంటనా బొమ్మెరిల్లు చిత్రాలకు Best Music Director అవార్డ్‌ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్‌ ఐటం సాంగ్స్‌ను కంపాజ్‌ చేయడంలో సిద్దహాస్తడు, Director సుకుమార్‌ చేసిన అన్ని చిత్రాలకు బెస్ట్‌ మ్యూజిక్‌ను అందించాడు దేవి... వీరి కలయికలో వచ్చిన ఐటం సాంగ్స్‌ నేటికి ప్రేక్షకుల నొళ్లలో నానుతున్నయంటే అతిశమోక్తి కాదు.

11.యాంకర్‌ :ప్రస్తుతం డమరుకం, జీసస్‌, ఊసరవెల్లి దడా చిత్రాలకు ట్యూన్స్‌ కంపోజ్‌ చేస్తున్న దేవి, నటుడిగా తెరపై కన్పించే ప్రయత్నం సఫలం కావాలని కొరుకుంటు, ఆ ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ లవర్‌కు మరోక్కసారి Hy Tv తరుపున బర్త్‌డే శుభకాంక్షలు అందిస్తూ నమస్కారం.

No comments:

Post a Comment