Tuesday, 21 February 2012

జమున

యాంకర్‌.1
సత్యభామ అంటే గుర్తోచ్చేది జమునే తెలిసిందిలే.... తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే అంటూ ఆడిపాడే అందాల జమున నన్ను దోచుకుందువటే అంటూ అన్నగారు పాడినా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న జమున అందాల సత్యాభామకు పుట్టినరోజు నేడు.

యాంకర్‌.2
1937వ సంవత్పరం ఆగస్ట్‌ ముప్పయ్యవ తేదీన  కర్నాటక్‌ రాష్ట్రమైన హంపీలో పుట్టింది జమున అయితే బాల్యమంతా గుంటూరులోని దాగ్గిరాలలోనే బాల్యమంతా గడిచింది. జమున అసలు పేరు జమునా బాయి.

యాంకర్‌.3
కళా వాచసృతి జగ్గయ్య గాందీ జమున ఊరేకావటంతో జగ్గయ్య ఓ నాటకం కోసం చురుగ్గా కన్పించే జమునను ఎంపిక చేశాడు అదే నాటకంలో గుమ్మడికూడా నటించటం విశేషం.

యాంకర్‌.4
రంగస్ధల ప్రతిభ ద్వారా జమునకు పుట్టినిల్లు సినిమా ద్వారా సినిమాల్లో తొలి అవకాశం వొచ్చింది ఆ తరువాత అన్నగారితో A.N.R తో ఎన్నో చిత్రాల్లో నటించింది. జమునది కళ్లు తిప్పుకోలేని అందం.

యాంకర్‌.5
జమున ఎంత కఠినమైన పాత్రనైనా ఇట్టీ పోషిస్తుంది అటు అందం ఇటు దూకుడు చురుకుదనం కలిపితే జమున అవుతుంది. అందుకే ఆవిడ చేసిన పాత్రల్లోని సీక్తీత్వం స్ట్రాంగ్‌గా కన్పిస్తుంది.

యాంకర్‌.6
జమున ఎన్ని చిత్రాల్లో ఎంత బాగా నటించినా ప్రేక్షకులకు మాత్రం ఆవిడ సత్యాభామ వినాయకచవితి చిత్రంలో సత్యభామ పాత్రలో కన్పించింది, ఆ తరువాత శ్రీ కృష్ణతులాభారం చిత్రంలో వీరవిహరం చేసింది జమున నటనలో N.T.R.నే డామినేట్‌ చేసింది.

యాంకర్‌.7
అప్పట్లో శృంగారం కళ్లతో పలికించే వారు చిన్న పెదవి విరుపుతోనే హయలు బలికించే వారు ఈ విద్యలో జమున అందెవేసిన చేయి రాముడు బీముడు చిత్రవలోని పాటలోని చురకత్తుల చూపుల్ని ఇప్పటీకీ ఏ నటీపలికించటేదేమో.

యాంకర్‌.8
గుండమ్మకథ చిత్రంలో సావిత్రి అద్భుత నటన ములదు వేరే వారయితే తేలిపోయేవారు అందులోనూ ఇటు  N.T.R. అటు A.N.R ఇంకా S.V రంగారావుగారు సూర్యకాంతం ఇంత మంది మహానటుల మధ్య పోగరు బోతు క్యారెక్టర్‌ జమున అద్భుతంగా పండించింది.

యాంకర్‌.9
ఆమెను చూసి రాస్‌ వారో ఆవిడే అలాంటి పాత్రల్నీ అద్భుతంగా నటించేదో గానీ పోగారుబోతు అహంకారి చురుకైన పాత్రలకు నృత్యాలకు జమున పర్మినెంట్‌ అడ్రస్‌జ

యాంకర్‌.10
మిస్సమ్మలో జమున పాత్ర చలాకీగా వుంటూ సావిత్రిని ఉడికిస్తూ సాగుతుంది అసలు జమున అందమంతా ఆమె నటక మాటా తీరూ కళ్లల్లో ఇలా ఒక్కటిని చెప్పలేం ఆమె ఆడదనం పలికిస్తూనే ఓడని జాణతనం కూడా పొగురు కూడా పలికిస్తుంది.

యాంకర్‌.11
వెండితెరపై జమున అందంమైన వెన్నెల వర్షం ఎన్నటికీ వాడిపోని పారిజాత పుష్పం. అందరినీ ఆటాడించే లీలా వినోద మానస చోరుడు శ్రీ కృష్ణుడే తన వాలు జడతో వాలు కనులతో వాలేట్టుచేపసిన అందాల రాక్షసి సత్యభామ.

యాంకర్‌.12
జమున రాజకీయాల్లో N.T రామారావు గారికి వ్యతిరేకం అయినా అందరికన్నా అన్నగారికి ఆవిడే పెద్ద ఫ్యాన్‌ ఈ వన్నెల దొరసానికి ఆంధ్రదేవమంతాఫ్యాన్సఠ్‌ మరోసారి జమున గారికి జన్మదిన శుభాకాంక్షలతో సెలవు నమస్కారం.

No comments:

Post a Comment