Tuesday, 21 February 2012

సుహసిని

యాంకర్‌.1
ఆమెది అద్భుతమైన అందం కాదు అయినా ఆమె తన నటనతో సమ్మోహనం చేస్తుంది కమాల్‌హసన్‌ అన్న కూతురు అనే మాట నుండి సుహసినికి కమాల్‌హసన్‌ బాబాయ్‌ అవుతాడు అనేంత వరకూ ఎదిగింది. నటిగానే కాకుండా అన్ని రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్న సుహాసినికి బర్త్‌డే విషెస్‌ అందిస్తోంది. Hy Tv.

యాంకర్‌.2
నటనలోనే కాదు దర్శకురాలిగా, నిర్మాతగా కథకురాలిగా కెమెరా విమెన్‌గా మేకప్‌ అర్టస్‌గా, హెయిర్‌ స్టైలిస్ట్‌గా రాణించి బ్రహముఖ ప్రజ్ఞాశాలిగా సినీరంగంలో తనదైన ముద్ర వేసుకున్న  సుహసిని కమలహసన్‌ అన్నయ్య గారైన చారుహాసన్‌ కూతురు.

యాకంర్‌ 3
చిన్నతనం నుండి సినిమాలపై ఆసక్తిని పెంచుకున్న సుహసిని తొలిసారి 1980 లో నెంజతై కల్లత్‌ అనే తమిళ చిత్రంతో వెండితెరపై తెరంగేటం చేశారు ప్రేక్షక జనరంజకమైన పాత్రలు పోషిస్తూ 1980,90 వ దశకంలో విశేషంగా రాణించిన సుహసిని మంచుపల్లకి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

యాంకర్ 4
అలనాటి తారల్లో మేటి తారగా గర్తింపు తెచ్చుకున్న సుహసిని నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు, తమిళం మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో నటించి ప్రేక్షకుల మెప్పుపొందారు ఆవకాశాలకోసం ఎదురు చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనె సుహసిని ఏ పాత్రమైనా అవలీలగా పొషించి మెప్పించగలదు.

యాంకర్‌ 5
తెలుగు సినీ జగత్తు వున్నంతకాలం ప్రేక్షకులు తన పాత్రను ఆస్వాదించేలా జీవంపోసిన సుహాసిని నవరాసాలను ఆవలిలగా పోషించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సిరివెన్నెల చిత్రంలో మూగదైన చిత్రకారిణిగా సుహాసిని హవభావాలు పలకించిన తీరు ఆమె నటన ప్రతిభకు విలువెత్తు నిదర్శనం. ఈ చిత్రంలో అంధుడైన కథానాయకుడి ప్రియురాలుగా నటించింది.

యాంకర్ 6
ఇమేజ్‌ చట్రాన్ని సృష్టించుకొని ఫార్ముల చిత్రాలను  పట్టుకొని వేలాడే నాయక నాయికలుగా కాలం వెళ్ళదీస్తున్నా రోజుల్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను చేసింది సుహాసిని. ఆమె చేసిన లేడి ఓరియెంటెడ్‌ చిత్రాలన్ని దాదాపుగా భాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించాయి అందుకే వైవిధ్యతకు పెద్దదిక్కు  సుహసిని అని అంటారు సినీపెద్దలు సిస్టర్ నందిని చిత్రంలో ఒక నర్సుగా తన జీవితాన్నే అంకితం చేసే పాత్రలో ఆమె నటన అత్యద్భుతం

యంకర్‌ 7
సుహాసిని సెంటిమెంట్‌ పాత్రలో నటించేటప్పుడు తన గొంతుకలోని అర్సతను మనసులోనుంచి బయటకు తీస్తారెమో అన్నట్టుగా వుంటుంది. హుషారైన పాత్రలో నటించేటప్పుడు ఆ కళ్ళలో వుండే వెలుగు, కరుణ పాత్రలోకి వచ్చేటప్పటికి మాయమైపోద్ది ప్రేక్షకుల కళ్ళలో కన్నీటిని రప్పిస్తుంది అందుకే ఆమె నటనకు చూసి ప్రేక్షకులు థియేటర్లో నుంచి బయటికి వస్తూ సుహసిని ప్రశంసిస్తారు

యాంకర్‌ 8
నువ్వు నాకు నచ్చావ్‌ చిత్రంతో సుహసిని పోషించింది చిన్నపాత్రే అయినా అలోచనవి రేకేత్తిస్తుంది హీరో వెంకటేశ్‌తో మాట్లాడే సంభాషణలు చాలా బాగుంటాయి..

యాంకర్‌ 9
క్యారెక్టర్ అర్టిస్టుగా చక్కని నటనను కనబర్చే సుహసిని తల్లి పాత్రలను అనుమానంగా పొషించి మెప్పించారు తల్లిగా కరుణారసాన్ని పండించి కన్నీళ్ళు తెప్పించారు ఏపాత్ర చేసినా అందులో పరకాయప్రవేశం చేసి అ పాత్రకే సజీవరూపం ఇచ్చే సుహసిని ఊయల చిత్రంలో ఆమె చేసినా తల్లి పాత్రను చూసిన ప్రేక్షకలు ఆమె వందలాది చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది అనే విషయాన్ని మరిచిపొతారంటే ఆమె కౌశల్యం ఎంత అద్భుతమైనదో కదా

యాంకర్‌ 10
1988లో కళాత్మక దర్శకుడు మణిరత్నాన్ని వివాహమాడిన సుహసిని కొద్దికాలం వెండితెరకు దురమయ్యారు. కానీ తన భర్త మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలకు కథలను అందించారు అందులో గురు, ఇద్దరు, చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి

యాంకర్‌ 11
ఉత్తరాది, దక్షిణాదిలో నటులకు నటవారసుల కొదువలేదు అయితే ఆ కుంటుంబంలో నుంచి ఏ ఒకరిద్దరో జాతీయ అవార్డును పొందివుంటారు, కానీ సుహసిని కుటుంబంలోనుంచి ఏకంగా నలుగురు జాతీయ అవార్డ్‌ గ్రహితులు వుండడం విశేషం ఇందులో సుహసినితో పాటు చారుహసన్‌, బాబాయ్‌ కమలహసన్‌ భర్త మణిరత్నం వంటి సినిప్రముఖులు వున్నారు

యాంకర్‌ 12
నటనతో ఎన్నో అవార్డ్‌ను సొంతం చేసుకు్న్న సుహసిని 1996 లో ఇందిర చిత్రాన్ని రూపొందించి దర్శకురాలిగా సినీ విమర్శకుల ప్రశంసలు పొందారు ఈ చిత్రాని ప్రశంసలు పొందారు ఈ చిత్రానికి ఆమె స్క్రీన్‌ ప్లేకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది

యాంకర్‌ 13
రాఖీ చిత్రంలో సుహసిని పోలీస్‌  ఆఫిసర్‌గా నటించిన తీరు చాలా బాగుంటుంది కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.

యాంకర్‌ 14
నటనకు కొత్త భాష్యాన్ని చెప్పిన సుహసిని నవ్వును ఆమె నటనకు దక్షిణాది అభిమానులు ఎప్పటికి మరిచిపోరు తన నటనతో చక్కని చిరునవ్వుతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సుహాసిని అంటే అర్థం ఏమిటో తెలుసా... చక్కని నవ్వే అమ్మాయని

యాంకర్ 15
సుహసిని సినీ ప్రస్థానాన్ని తెలుసుకున్నాకదా హెచ్‌వైటీవి తరుపున ఆమెను మరోకసారి జన్మదిన శుభాకాంక్షలు అందించి సెలవు తీసుకుందాం నమష్కారం

No comments:

Post a Comment