Tuesday, 21 February 2012

కొసరాజు రాఘవయ్య చౌదరి

యాంకర్‌
అతను...హలము పట్టి... పొలం దున్నుతాడు...కలం పట్టి...పాటలు రాసి...బంగారు పంటలు పండిస్తారు. మట్టిలోంచి వొచ్చిన రాజు... మట్టి వాసన తెలిసిన కలం... అమృతం కురిపించింది. ఆ రాజు పేరు కొస రాజు... కొసరి కొసరి..పాటల్ని మనకు వడ్డించిన కొసరాజుగారి వర్ధంతి నేడు... ఆయన మనకందించిన అమృత సమానమైన పాటల్ని ఆలకిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిద్దాం.

యాంకర్‌.1
కొసరాజు గారి పూర్తిపేరు కొసరాజు రాఘవయ్య చౌదరి... ఆయన కలం నవరసాలను వొలికించేది... పాట విన్న వారి తనువు పులకించేది... తన శైలి విలక్షణం - ఇక హాస్యానికైతే కొసరాజు గారి తరువాతే ఎవరైనా - అన్పించారు. పేరు కొసరాజు తెలుగంటే పెద్ద మోజు అని తనకు తనే చెప్పుకున్నారు.

యాంకర్‌.2
కొసరాజు... పుట్టిందే సాహితీ వనంలో... ఆ పరిమళాల మధ్యనే పెరిగినా... ఏ సువాసనా ఆపాదించుకోక తనకంటూ ఓ శైలిని పట్టుకున్నాడు. సాహిత్యం మీద పట్టున్నవాడు... పండితులు త్రిపురనేని రామస్వామి తనకు పెదనాన్న - అవుతాడు... సాహితీ ప్రక్రియలో... అన్ని అంశాలు సృశించాడు... ప్రేక్షకుల మనసులో నిండిపోయి తరించాడు.

యాంకర్‌.3
జానపదాలను రాయటం అందరికీ చాతకాదు... అందులో ఒక వగరుంటుంది... పోగరుంటుంది... ఆ వగరుపొగరు కలిపి...కలం ఝళిపి... కొసరాజు... రాసిన పాటలెన్నో చిరంజీవులు... అయ్యాయి... నాగలి పట్టిన చేయి... కలం పడితే...పదాలను... నిఘంటువుల్లో సైతం పండితులు వెదుక్కోవాలి.

యాంకర్‌.4
సిగిరెట్టు మీద పాటంటే... రొసరాజు రాసిన పాటే రారాజుగా మిగిలిపోతుంది... ఆ తరువాత... సిగిరెట్‌ మీద పాట రాయటానికి ఎంత పెద్ద కవికైనా ధైర్యం... చాలదేమో... సరదాగా మొదలెట్టాడో... సీరియస్‌గా...సిగిరెట్‌ తాగుతూ రాసాడేమోగానీ...సరదా సరదా సిగిరెట్టు... పాట... ఇప్పటికీ ఫ్రెష్‌గా వుంటుంది.

యాంకర్‌.5
సినిమా అంటూ అప్పట్లో... తీస్తే... అందులో కొసరాజుగారి పాట వుండి తీరాల్సిందే... కొసరాజుగారి పాట కూరలో కరివేపాకు లాంటిది కాదు... పోపులాంటిది... ఘుమ..ఘుమలాడే సోపులాంటిది స్నానం అయ్యాక కూడా ఆ పరిమళం వెన్నంటి వుంటుంది.

యాంకర్‌.6
కె.వి.మహదేవన్‌ గారిని మామను చేసింది... కొసరాజుగారే...మంచి మనసులు చిత్రం కోసం...మావా... మావా... మావా... అంటూ మావా... భామ..పాటను మించిన పాట ఇంకేముంటుంది. ఈ పాటలో ప్రేమ ముగ్గులోకి దింపుతారంటూ ఎంత అందంగా... రాశారో...కొసరాజుగారు నిజంగా పాటల రాజే...

యాంకర్‌.7
ఆ మాలెక్కణుంచి వొస్తాయో... ఆ...సొగబులు ఎలా అద్దుతారో గానీ...కొసరాజుగారి పాటల గురించి ఎన్నని చెప్పుకోవాలి. సముద్రాన్ని శంఖంతో తోడితే అది ఎన్నాళ్లకు ఖాళీ అవుతుందనీ...రామాయణంలో గుహడికి ఓ పాట పెట్టటమే సాహసం అయితే ఈ పాటను పదికాలాల పాటు... నిలిచేలా రాసారు.

యాంకర్‌.8
కొసరాజుగారు మొదట రైతుబిడ్డ చిత్రంలో కథానాయకుడిగా నటించారు... మన తెలుగు వారి అదృష్టవశాత్తూ ఆయన కలం పదును తెలుసుకున్న బి,యే. సుబ్బారావుగారు...కె.వి.రెడ్డిగారు. ఆయనతో పాటలు రాయించారు. ఆ మహాను భావులకు పాదాభి వందనాలు చేయాలి... లేకపోతే ఎన్ని మంచి పాటల్ని మనం కోల్పోయే వారమోకదా...

యాంకర్‌.9
కొసరాజు...మట్టిని చదివాడు...మనుషుల్ని చదివాడు... మనసుల్నీ చదివాడు... ఆ మాటలు... ఆ పాటలు... ఆ హస్యం... ఆ చాతుర్యం... గోమాత పై రాసినా...భూమాత పై రాసినా... మనసు హిమంలా కరిగిపోతుంది. రచయితగా హిమాలయం అంత ఎత్తు ఎదిగిన కొసరాజుగారు... అందరికీ ఆదర్శం. ఈ సరస్వతీ మూర్తికి... జేజేలు అర్పిస్తూ...సెలవు నమస్కారం.

No comments:

Post a Comment