Tuesday, 21 February 2012

రాజేంద్ర ప్రసాద్‌

యాంకర్‌ :కితకితలైన..గిలిగింతలైనా... హహహాలైనా హిహిహిలైనా... కడుపునిండా కామెడితో ఫుల్‌ మీల్స్‌ పెట్టటం ఒక్కటే అతనికి తెలుసు... అతన్ని కొందరు ఆంద్రా చాప్లిన్‌ అంటారు. నవ్వుల కిరిటి అనీ నవ్వుల రారాజనీ మరికోందరు అంటారు. రాజేంద్ర ప్రసాద్‌ అని అందరూ అంటారు... ఇతను రాజబాబు నక్షత్రంలో రేలంగి రెండో పోదంలో హాస్యపు ఘడియాల్లో పుట్టాడు ఈ రోజు ఈ నవ్వుల రాజు పుట్టిన రోజు.
   
యాంకర్‌ :గద్దె రాజేంద్ర ప్రసద్‌... 1956 జూలై 19న...కృష్ణా జిల్లా నిమ్మకూరూలో జన్మించారు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి  తన గమ్యం వెతుక్కుంటూ ఎన్నొ కష్టాలను ఎదుర్కోని... చిన్న చిన్న వేషాలతో సర్దుకు పోతూన్న రాజేంద్ర ప్రసాద్‌ తొలి చిత్రం 1977లోని స్నేహం అయితే 1982లో  వొచ్చిన మంచుపల్లకి చిత్రంతో బ్రేక్‌ వొచ్చింది. ఈ చిత్రానికి వంశీ డైరెక్టర్‌.
   
యాంకర్‌ :మంచు పల్లకిలో చిరంజీవితో కలసి హిట్‌ కొట్టిన రాజేంద్ర ప్రసాద్‌ ఒక్క 1983లోనే చిన్న చిన్న వేషాలు ఎనిమిది సినిమాల్లో వేశాడు అయినా..ఫలితం శూన్యం. మళ్లీ చిరంజీవితో ఛాలెంజ్‌ చిత్రంలోని పాత్ర గుర్తింపు తెచ్చింది.
   
యాంకర్‌ :రాజేంద్ర ప్రసాద్‌కు మొదట గుర్తింపు నిచ్చిన దర్శకుడు వంశీ. మంచుపల్లకి తరువాత చాలా రోజులకు... ఒక అద్భుత చిత్రంతో రాజేంద్ర ప్రసాద్‌ రాత మార్చేశాడు. ఆ చిత్రమే లేడిస్‌ టైలర్‌ ఈ చిత్రంలోని సుంచరం పాత్ర ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ మెదలు తూనే వుంది.
   
యాంకర్‌ :మట్టి మట్టిగా వున్నంత కాలం విలుమేముంది. అది కుమ్మరి చేతిలో పడితేనే ఒక కణకృతి దాల్చుతుంది. ఈ సారి రాజేంద్ర ప్రసాద్‌... హాస్మబ్రహ్మ చేతిలో పడ్డాడు... ఆ చిత్రం రెండురెళ్ల ఆరయితే ఆ దర్శకులు కర్తిశేషులు జంధ్యాలగారు.
   
యాంకర్‌ :జంధ్యాల గారు తెలుగు వారిగా పుట్టడం వారి అదృష్టం. సున్నితమైన హాస్యానికి ఆయన కేరాఫ్‌ అడ్రస్‌ ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్‌తో... మరో చిత్రం అహనా పెళ్లంట చిత్రం ొక హాస్యపు జడివానే అనుకోవాలి. ఈ చిత్రంలో కోట పాత్ర ఒక అధ్బుతమైతే...మరో అద్భత నటుడైనా బ్రహ్మానందాన్ని ఈ చిత్రంతోనే పరిచయం చేశారు.
   
యాంకర్‌ :రాజేంద్ర ప్రసాద్‌ కేవలం కామిడీ నటుడే కాదు... అద్భతమైన నటుడు అన్ని పాత్రలో కూడ ఇట్టే ఒదిగి పోతాడు. ఎర్రమందరం చిత్రంతో... రాజేంద్ర ప్రసాద్‌ ఉత్తమ నటుడిగా నంది అవార్డుని అందుకున్నారు.
   
యాంకర్‌ :రాజేంద్ర ప్రసాద్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిల్యూట్స్‌లో ఎన్నొ గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంలో అతని  నట విశ్వరూపమే చూడొచ్చు. ఈ చిత్రంతోనే ప్రముఖ నటి రోజ వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక కామేడి వారసత్వాన్ని జంధ్యాల నుండి అందుకున్న e.v.v. సత్యనారాయణ గారు అప్పుల అప్పారావుగా అధ్భుత కామెడిని పంచారు. ఈ ఆప్పారావును మనం మరిచి పోగలమా.
   
యాంకర్‌ :రాజేంద్ర ప్రసాద్‌ అదృష్టమో మన అదృష్టమె గానీ... రాజేంద్ర ప్రసాద్‌ అందరి డైరెక్షన్‌లో చేశాడు. అందులోనూ బాపూ గారి పెళ్లిపుస్తకం కొస్సమే అనుకోవవాలి.
   
యాంకర్‌ :రాజేంద్ర ప్రసాద్‌ను దక్కని అద్భుతమైన కాంప్లిమెంట్‌ ఏంటంటే  మాజీప్రధాని స్వర్నీయ పి.వి నర్సింహారావుగారు రాజేంద్ర ప్రసాద్‌ సినిమాలు చూస్తురిలాక్స్‌ అవుతానన్నారు ఇంత కంటే ఇంకేం కావాలి.  బృందావనం చిత్రం నిజంగా ఆనందాల బృందావనంగానే చిత్రకవించారు సింగీతం శ్రీనివాసరావుగారు.
   
యాంకర్‌ :కామేడి చిత్రల విజయ పరంపర కొనసాగిస్తున్న రాజేంద్ర ప్రసాద్‌కు బాపుగారు మరో వరం మిస్టర్‌ పెళ్లాం ద్వారా అందించారు ఈ మధ్య కాలంలో మేడం, మాయవోడు, జోనర్‌ ఇలా వెరైటీ పత్రలు ధరించినా  మిస్టర్‌ పెళ్లాం చిత్రం ఎంత బాగా పండించారో బాపురమణలు అంతే బాగా నటించాడు రాజేంద్ర ప్రసాద్‌.
   
యాంకర్‌ :అటుకుల బిట్టి బాబుగా ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో రావుగొపాల రావుగాని వొస.. పంచ్‌లు ఎంత బావుటాయో అమాయకంగా రాజేంద్ర ప్రసాద్‌ నటన కూడా అంతే బాగా వుంటుంది.
   
యాంకర్‌ :ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్‌ ఆలీబాబు అరడాజను దోంగలు రాబంటు,నవ్వులాట, హిట్లర్‌, మా అల్లుడు వెరీగూడ్‌..ఇలా తన మనుసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఓ చిత్రం దగ్గర ఈగిపోయాడు అదే ఆనలుగురు ఇందులో రఘురాం పాత్రాను ఇంకెవర్నీ ఊహించుకోలేం.
   
యాంకర్‌ :శఖాహారం మాత్రమే తీసుకోవాలనే ఓ మంచి ఉద్దేశ్యంతో... క్విక్‌గన్‌మురుగన్‌ అనే ఆంగ్ల చిత్రం ద్వారా అంతర్జాతీయంగా కీర్తిని సంపాదించిన ఈ నట కిరీటి..కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటోంది. hytv ఈ నవ్వుల రోజు నవ్వుతూ నవిస్తూ వుండాలని ఆశిస్తూ.

No comments:

Post a Comment