Tuesday, 21 February 2012

సి.నా.రె.

యాంకర్‌.1
అతని పేరు... మూడు పొడి  అక్షరాలు... మామనుడూ.. మూడే అడుగులు అడిగాడు... మామనుడు విష్ణుమూర్తి అవతారం అయితే అతను సరస్వతీ పుత్రుడు ఆ మూడు పొడి అక్షరాలు సి.నా.రె.  సాహితీ వనంలో పూసిన అరుదైన పుష్పం సరస్వతీ మాతకు ముద్దు కొడుకు సి.నా.రె.  సింగిరెడ్డి నారాయణరెడ్డి.  ఈ అపురూప కవి, రచయితకు నేడు పుట్టినరోజు.  ఈరోజు కవిత్వానికి పుట్టినరోజు పాటలకు పుట్టినరోజు.

యాంకర్‌.2
కవి, రచయిత సి.నా.రె కరీంనగర్‌ జిల్లా హన్మజీపేటలో 1931 జూన్‌ ఇరవై తొమ్మిదిన జన్మించారు.  డిగ్రీ వరకూ ఉర్దూ మీడియంలోనే చదవుకున్నారు.  పీజీ.. పీహెచ్‌డీ తెలుగు సాహిత్యంలో పూర్తి చేశారు.  1962లో గుళేబా కావాలి కథ చిత్రంలోని అన్ని పటలూ రాయటం ద్వారా.. చిత్రసీయలోకి అడుగుపెట్టారు.  ఈ చిత్రంలోని పాటలన్నీ అద్భుతాలే  అయినప్పటికీ నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని ఈ పాటను మరువగలమా?

యాంకర్‌.3
సి.నా.రె గారి పాటల్లో జీవముంటుంది అక్షరాల్లో అమృతం భావంలో సొబగు దాగుంటుంది.  అది పొటగా మనసును మురిపిస్తుంది.  ఎన్ని పాటలు రాసినా.. ఆ కలానికి సాహితీ దాహం తీరలేదు..  బందిపోటు చిత్రంలోని వగలరాణివి నీవు... సొగుసు కాడనునేనే ఈడుకుదిరెను జోడు కుదిరెనూ మేడ దిగిరావే.... ఎంత చక్కటి సాహిత్యం.. ఎంత కమ్మటి సందేశం.

యాంకర్‌.4
సి.నా.రే....రాసిన పాటల్లో ఫలానా పాటే బావుందని అనటానకి మనసొప్పుకోదు.  ఎందుకంటే అన్ని పాటలూ ఆణిముత్యాలే కదా..  అయితే నందమూరి తారక రామారావు గారికే సినారే గారు ఎక్కువ పాటలు రాయటం ... వారి మధ్య మైత్రి బంధమో ఆ దైవసంకల్పమో తెలియదు.

యాంకర్‌.5
అమరశిల్పి జక్కన్న చిత్రంలో... ఒక అద్భుత అపూరూప గీతాన్ని రాశారు... రావారనే కంటే.... అక్షరాలతో జీవం పోశారని అంటే ఓచిత్సంగా వుంటుందేమో..  ఈ నల్లని రాళ్లలో... ఏ కన్నులు దగెనో ఈ బండలమాటున ఏ గుండెలు మ్రోగెనో....ఎంత సరళమైన.. పదాలు ఎంత చక్కటి కూర్పు ఈ గీతానికి సాదారి రాజేశ్వర రావుగారి... సంగీతం ప్రాణం పోసింది కదలలేవు..మెదాలలేవు... పెదవి విప్పి పలుకలేవు ఉలి అలికిడి విన్నంతనే.... గల గల మని పొంగిపొరలు సినారే గారి కలానికి వందనం చెద్దామా?  ఆయన భావుకతకు ాయనలోని సరస్వతికి వందనం చేద్దామా.

యాంకర్‌.6
రాముడు భీముడు చిత్రం ఇటు రామానాయుడు..గారికి ఒక బ్రేక్‌ నిచ్చింది. ఈ చిత్రం పరాజయం పాలైతే ఇక సినిమా పరిశ్రమను వొదిలివేద్దామని అనుకున్నారాట ntrగారు ద్విపాత్రాభినయవ చేసిన ఈ చిత్తంలో నారాయణ రెడ్డి గారు రాసిన రెండు గీతాలొ అత్యంత ప్రచార్యం పోందాయి. అందులో తెలిసిందిలే... తెలిసిందిలే పాట ఎంత చక్కగా సంగీతం నృత్యం కుదిరాయి ఈ చిత్రానికి పెండ్యాల నాగుశ్వర్‌రావుగారు.. సంగీతం సమకుర్చారు.

యాంకర్‌.7
మట్టిలో మణిక్యాలు చిత్రం అప్పట్లోనే ఎంత పెద్ద హిట్‌ సినిమా ఈ చిత్రంలో నటించిన చలం నిర్మాతగా వ్యవహరించారు. 1971లోనే హైదరాబాద్‌ పై అద్భుత గీతాన్ని రాశారు సినారె... హైదరాబాద్‌లో పరిగిన చదువుకున్న సినారె..ఈ గీతం రాయటం..విశేషమైతే... అప్పట్లో హైదరాబాద్‌..ఎలా వుండేదో చూడొచ్చు..నలభై ఎళ్ల క్రితం నగరం అందాలను వివరిస్తూ రిమ్‌జిమ్‌..రిమ్‌జిమ్‌..హైదరాబాద్‌ రిక్షావాలా జిందాబాద్‌.. మూడు చక్రములు గిరగిర తిరిగితే..మోటరు నగరం బలాదూర్‌ అంటూన్న ఈ పాట చూద్దామా...

యాంకర్‌.8
ప్రముఖ నటుడు రచయిత కవి తణికెళ్ల భరణి సినారే గారి గురించి చమత్కారంగా చెప్తూ జొన్న రొట్టె మిద వెన్నపూస పూసెనారె తెలుగు పాట బుగ్గ మిత బిటిక వేసినారె ఇంతింతై విశ్వంభరనంత బొసినారె జానపదములేసినారే అంటూ ఎంత చమక్కుతో సినారెను వాడి పద్యం చెప్పారో కదా.. భళారే..భరణి.. బాల మిత్రుల కథ చిత్రంలోని ఈ పాటను తెలుగు వారెవారైనా మరువగలరా...?

యాంకర్‌.9
సినారె ఎన్నొ ఉర్దూ తెలుగు గజల్స్‌ రుబాయిలు రాసారు... అవన్నీ వేటికవే అమూల్యమైనవీ మనసును చేతివేలితో కవ్వంలా చిలికేవీ వాటిలో మచ్చుకు ఒకటి ఈ సందర్భంగా గుర్తుచేసుకూదాం.

యాంకర్‌.10
అల్లూరి సీతారామ రాజు చిత్రంలో ఒక పాటను మనకందించారు సినారె గారు ఈ చిత్రంలో పాటతో పాటు కథా..సాగుతుండటం ఒక విశేషం.

యాంకర్‌.11 కవిగా ఎన్నొ రచనలు చేసిన సినారె ఒక అపురూప, పద్రకార్యం రచించారు అదే విశృంధర దీనికి భారతదేశంలో సాహితీ ప్రక్రియలోని అత్యున్నత పురస్కారమైన జ్ఞానఫీఠ పురస్కారం లభించిందది.

యాంకర్‌.12
విశ్వంభర..నిజంగా విశ్వమంతా వ్యాపించినట్టే వుంటుంది. అందులోంచి కొన్ని పంక్తులువిందాం.

యాంకర్‌.13
ఎంతగొప్ప కవిత్వం ఎంతగొప్ప పద్యకావ్యం సినారే గారి చెంతకు అవార్డులన్ని వెతుక్కుంటూ వొచ్చి చేరాయి. కళాప్రపూర్ణ, పద్మశ్రీ పద్మభొషణ, ఇంకా జ్ఞానపీఠ అవార్డు ఇంకా ఆయన వితృత్తాను తొచే తొనికరాళ్లు రాలేదు..కావు కూడా ఈ సరస్వతీ పుత్రుడికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ hytv ఆయురరోగ్యం ఐశ్వర్యాలు సాద్ధించాలని ఆ భగవంతున్ని కోరుకుంటోంది.

No comments:

Post a Comment