Tuesday, 21 February 2012

ఫ్రెండ్ షిప్ డే

యాంకర్‌.1
హాయ్‌ వెలకట్టలేనిది స్నేహం .ఈ లోకంలో స్నేహామనే తోడు లేకుండా ఏ వ్యక్తి తన జీవనాన్ని కొనసాగించలేడు. దేవుడు ఇచ్చిన ఈ బంధం రక్తసంబంధం కాకపోయిన అంతకంటే గోప్పది. ఏ స్వార్ధం లేకుండా జీవితాంతం తోడుండే ఈ స్నేహాం పరిచయమనే పునాది మీద ఎర్పడి చితిమంటతో చివరి కట్టే కాలే దాక వుంటుందని మనకు ప్రతి సంవత్సరం గుర్తూ చేస్తూనే వుంటుంది.ఈ రోజుఫ్రెండ్‌షిప్‌డే , తుది శ్వాస వరకు ప్రతిరోజు ఫ్రెండ్ షిప్ డే నే ... 1935లో ఆమెరికా కాంగ్రెస్‌ ప్రకటించిన ఈ ఫ్రెండ్‌షిప్‌డే సంప్రదాయం నేటికి ప్రపంచదేశాల్లో కొనసాగుతూనేవుంది ఈ సంధర్భంగా అ స్నేహామాధుర్యాన్ని పంచుకుందాం పదండి.

యాంకర్‌.2
స్నేహం ఎవరెవరి మధ్య చిగురురిస్తోందో చెప్పలేం కానీ చిగురించిన ప్రతి స్నేహం వాడి పొకుండా కలకాలం అలాగే నిలిచిపొతుంది, ఎన్నో అద్భుతాలకు తెరదీస్తుంది, అలాంటి గోప్ప స్నేహo  గురించి ముందుగా తెలుసుకుందాం.

యాంకర్‌.3
స్నేహమన్నది శాశ్వతం, స్నేహనికి అంతరం వుండదు, నిష్కల్మశ మైన  స్నేహం గురించి ,స్నేహ సంబంధాల గురించి మన చిత్రాల్లో ఎంత బాగా చూపించారో తెలుసుకుందాం

యాంకర్‌.4
స్నేహమనే మజిలీ చేయకుండా జీవితమనే తీరాన్ని ఎవరు దాటలేరు కానీ ఆ స్నేహితూణ్ణి ఎంచుకోవడమే కష్టం చాలా వరకు చిన్ననాటి స్నేహలే మధుర జ్ఞాపకాలవుతాయి, మరికోన్ని జీవితాలవుతాయి అయితే స్నేహనికి ఒక ప్రత్యేకమైన రూపువుండదు అరూపును తమ స్నేహమనే కుంచేతో అ స్నేహితుడే అ చిత్రాన్ని గీసుకుంటారు, ఇప్పడీ బాల్య స్నేహితులను చూడండి.

యాంకర్‌.5
స్నేహం గురించి చాలా మంది గొప్పగా చెపుతారు, ఎంతో మందిని ఉదహారణగా తీసుకొంటారు, వర్ణనలతో, కవితలతో మనసుని పరవశింపజేస్తారు, కానీ తమ నిజరూపాన్ని చూపించి అదె మనసుని ముక్కలు చేస్తారు, స్నేహాం చేయడం వీరికి తెలియకపోయిన స్నేహం తన లక్షణాల్ని మార్చుకొదు కదా.

యాంకర్‌.6
స్నేహం అనే పదంలో స్నేహితులిద్దరు చెరో అక్షరం కాదు ఎందుకంటే స్నేహమనే పదమే వీరికి దాసోహం కాబట్టి అల్లరి,చిరాకు,పరాకు,కొట్లాటలు, ఇలా ఎన్నో వీరిసొంతం మంచి చెడు చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహబంధానికి ఏ ఒక్కరు అతతులు కారు.

యాంకర్‌.7
భూమి గుండ్రంగా వుంటుంది అవును అయితే  జీవిత ప్రయాణం లో ఎందర్నో కలుస్తాం, విడిపోతం కానీ కొందరే స్నేహితులవుతారు . ఈ ఫీలింగ్ పాటగా  పాడితే......

యాంకర్‌.8
 స్నేహమనే చిరుజల్లులో  తడిసి  ఆ సుమధుర మాధుర్యాన్ని అనుభవించం   కదా . మరొక్కసారి ఫ్రెండ్ షిప్ డే శుభ కాంక్షలను అందిస్తూ bye

No comments:

Post a Comment