Tuesday, 21 February 2012

తనికెళ్ళభరణి

                           
    యాంకర్‌ : పసి పిల్లవాడు వచ్చిరాని మాటలతో తల్లిని సంతోషపెట్టినట్టుగా... తెలుగు తెరపై ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నక్షత్ర దర్శనంతో కవులను కళకారులను ఎందరో మహానుభావుల రచనతో మహాపురుషులను నటనతో అఖిలాంధ్ర ప్రేక్షాకలోకాన్ని తనికెళ్ళ భరణి కుడా మహాపురుషుడు, బహుముఖ ప్రజ్ఞశాలి, తెలుగు తెరపై వెలిసిన కుంకుమభరిణి పుట్టిన రోజు నేడు, ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందిస్తూ ఆమన సినీ జీవితాన్ని డిసైడ్‌ చేద్ధాం పదండి.

    యాంకర్‌: చలనచిత్ర, సాహిత్య, నాటకరంగాలు పునర్జన్మను పొందిన రోజులవి, తెలుగుపదాలు కోత్త వెలుగును సంతరించుకొని దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతున్న క్షణాలవి, నిజానికి బహుముఖ ప్రజ్ఞశాలి, సకలశాస్త్ర కోవిదుడు, తనికెళ్ళ భరణి జన్మించిన సందర్భమది కవిగా, నటుడిగా,సినీజీవిత రజోత్సవాన్ని వెండి పండుగలా, కనుల విందు కలికించేలా అత్మీయుల మధ్య, సినీ దిగ్గజ ప్రముఖుల మధ్య, జరుపుకున్న తనికెళ్ళ భరణి స్వస్ధలం పశ్చిమ గోదావరి జిల్లా పోడురు మండలం కాగా ఆయన హైదరాబాద్‌లో జన్మించారు. నమ్మస్తే అన్న చిత్రంలో ఆయన నటన ఓ సారి చూసి ఆనందించండి.

    యాంకర్‌: మాటల చాతుర్యంతో, పద ప్రమోగ విన్యాపాలతో సరికొత్త రుచులను వడ్డించే భరణి బాధ్యత లేని కొడుకుగా తండ్రి చే ఎన్నో చివాట్లుతాన్నాడు, ఏడుగురు అన్నదమ్ముల మధ్య వెలిగి అవమానాలు భరించాడు, అ బాధలో పుస్తకాలు చదివి గంధ్రలయాన్నే తన బుర్రలో ఎక్కించుకున్నాడు. రంగస్ధలంలో రచనలతో రాణించి, వెండి తెరకు కొత్త రూపునిచ్చాడు, అ తర్వాత కాలంలో తండ్రి పాత్రలే ఎక్కువగా పోషించాడు, కొడుకుని వేధించి ప్రయోజకుణ్ణి చేశాడు.

    యాంకర్‌: కవులు అలసిపోరు, వారి కలం నిరంతరం పారుతూనే వుంటుంది, నటులు విశ్రమించరు, వారి నటనకు ప్రాణం వుంటుంది. అందుకే తనికెళ్ళ భరణి ఎపూడూ వికసించిన పుష్పంగా తన మకరందాన్ని మనకి అందిస్తూనే వుంటారు. 500లకు పై చిలుకు చిత్రాల్లో నటించిన తని కెళ్ళ భరణి రైటర్‌గా కంచుకవచం చిత్రంతో తెలుగు తెరపై అరంగేట్రం చేశారు. తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. గుండమ్మ గారి మనవడు చిత్రంలో ఒక పాటరాసి స్వయంగా పాడడం భరణి వైవిద్య ప్రతిభకు నిదర్శనం.

    యాంకర్‌: వాసుకి సర్వాన్ని తాడగా చేసి మంధర పర్వతాన్ని కవ్వంలో మలిచి, క్షీరాసాగరిన్ని మధించి అమృతాన్ని వెలికి తీసినట్టూ తనికెళ్ళ భరణి ప్రతిభను రాళ్లపల్లిగారు గుర్తించి వెలికి తీసారు. అంతే ఎన్నో రకాల సాహితా్యలు, ప్రబంధలు పురాణాలు చదివి విజ్ఞాన సారాన్న తన అము్మలపొదిలో భధ్రపరుచుకున్న భరణి లేడీస్‌ టైలర్‌ చిత్రంతో తన అస్త్రాలను బయటికి తీసారు హస్వానిక్‌ హాస్యం పుట్టించేంతటి రచన చేసి కడుపుబ్బ నవ్వించారు.

    యాంకర్‌: తన అత్మీయ స్నేహితుడు వంశీతో చాలా చిత్రాల్లో భాగం పంచుకున్న భరణి, వంశీకి శ్రీ కనక మహలక్ష్మీ రికార్డింగ్‌ ట్రూప్‌ చెట్టు కింద ప్లిడర్‌ ఘన విజయలు అందించాడు, ఈ చిత్రాల్లో భరణి కూడా నటుడిగా కన్పించి అలరించాడు.

    యాంకర్‌: మాటలు రచయితగా మంచి పేరు తెచ్చుకున్న భరణి పెద్ద మనిషి తరహా పాత్యలే కాకుండా హస్యరసా పాత్రలు పోషించాడు మనీ చిత్రంలో మనిక్యం పాత్ర ఎంత బాగా నటించారో.

    యాంకర్‌: సముద్రం సినిమాలో చేపల కృష్ణగా భరణి నాటన అద్భుతం.. విలన్‌గా నటుడిగా కమీడియాన్‌గా భరణి నీళ్ల లాంటి వాడు. ఏ పాత్రలో పోసినా ఆ పాత్ర ఆకారం ధరిస్తాడు. క్యారెక్టర్‌ అర్టిస్ట్‌గా కంటే విలన్‌గా అ పాత్రలకు సజీవరూపం ఇచ్చిన భరణి కామెడి విలన్‌గా, యాక్షన్‌ విలన్‌గా తనలోని ఛిన్న పార్శ్యలను చూపించాడు. యమలీల చిత్రంలో గల్లీలో తన చెల్లికి మళ్ళీమళ్ళీ పెళ్ళి చేస్తానని డైలాగ్‌లు చెప్పి విలనీజానికి కొత్త రూపునిచ్చాడు. ఇలాంటి పాత్రలకు ప్రాణం పోయడం అతనికి వెన్నుతో పెట్టిన విద్య. సిరా key ఆనే లఘు చిత్రంతో దర్శకుడిగా ఆడుగులు వేసిన భరణి త్వరలోనే దర్శకత్వం వహించబొతున్నారు. అ సినిమా ఘన విజయం సాధించాలని  కొరుకుంటూ, తెలుగు భాషా అభిమాని అయిన భరణికి మరోక్క సారి జన్మదిన శుభకాంక్షాలు అందిస్తూ సెలవు తీసుకుందాం
నమస్కారం.

No comments:

Post a Comment