Tuesday, 21 February 2012

రాధిక

యాంకర్‌.1
రాధిక... ఈ పేరు వింటే... ముద్దుగా బొద్దుగా చలాకీగా వుంబే...బూరె బుగ్గల రాధిక కాక ఇంకెవరు గుర్తొస్తారు. రాధిక... ఒక అద్భుతం... రాధిక ఒక ఆశ్చర్యం... ఎందుకంటే ఇన్నేళ్లయినా... ఇన్నాళ్లయినా... రాధికలో చలాకీ తనం తగ్గలేదు... పై పెచ్చు పెరిగింది. ఆ చలాకీ తనానికి నేడు పుట్టిన రోజు.

యాంకర్‌.2
రాధిక...పరిచయం అవసరంలేని పాదరసం లాంటి హీరోయిన్‌... మోడ్రన్‌ అని మురిసిపోతున్న నేటి తరం హీరోయిన్‌లు ఎన్ని వేషాలు వేస్తున్నారో అంతకు రెండింతలు అల్లరి ఆటాపాటా డాన్స్‌లు చేసిన హీరోయిన్‌ రాధిక.

యాంకర్‌.3
రాధిక తెలుగు తమిల్‌ కన్నడ సినీ రంగాన్ని ఏలింది... మిగతా వాటి విషయాలను పక్కన పెడితే... తెలుగులో రాధికది ఓ సువర్ణ అధ్యాయం... హిట్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. రాధాకళ్యాణం, న్యాయంకావాలి. కిరాయి రౌడీలు... ఆ రోజుల్లో చిరంజీవితో సమానంగా ఆడేది రాధిక ఒక్కరే.

యాంకర్‌.4
పల్లెటూరి పిల్లగా... మోడ్రెన్‌ డ్రెస్‌లో... పచ్చి మాస్‌గా... సంప్రదాయంగా... గృహిణిగా ఎన్ని పాత్రలు ధరించినా అన్ని అన్నిట్లోనూ... వొదిగి పోయేది. అది ఆమెకు దేవుడిచ్చిన వరమేమో.

యాంకర్‌.5
రాధిక... తండ్రి తమిళ నటుడు M.R. రాధా...తండ్రి వారసత్వాన్ని అనుకోకుండా తీసుకుంది రాధిక ఆమె బాటలోనే... రాధిక చెల్లెలె నిరోషా హీరోయిన్‌గా చాలా చిత్రాల్లో నటించింది. రాధిక మొదట... అప్పటి నటుడు ప్రతాప్‌ పోతన్‌ను వివాహమాడింది. అయితే... తరువాత విడిపోయారు.

యాంకర్‌.6
హీరోయిన్‌గా దుమ్ముదులిపి తెరమరుగైన హీరోయిన్‌లు ఎందరో వున్నా... రాధిక ఆ కోవకు చెందదు... కాస్త వయసు మీరక ముందే... పెద్ద పెద్ద పాత్రలు ధరించింది. అందులో స్వాతిముత్యం.. స్వాతి కిరణం లాంటి ఆణిముత్యాల్లాంటి సినిమాలెన్నో వున్నాయి.

యాంకర్‌.7
రాధిక... జీవితంలో ఎన్నో ఆటు పోట్లు... ఎన్నో సునామిలు అయినా తట్టుకుంది... ఎదురించింది. ఎదురెళ్లింది. గెలిచింది. అనే కంటే ఇంకే దయినా గొప్పపదం వుంటే బావుంటుంది. ఆస్ధులు అన్నీ పోగోట్టుకుని ఒంటరిగా నిల్చుంది అన్ని పోయినా ఆత్మస్థయిర్యం ఒక్కటే రాధిక దగ్గరుండి పోయింది. దాంతో మళ్లీ సామ్రాజ్యాన్ని నిర్మించింది... సామ్రాజ్ఞి అయ్యింది. ఈ సామ్రాజ్యం పేరే. రాడాన్‌ మీడియా వర్స్క్‌...

యాంకర్‌.8
రాధిక టీవీ రంగంలో సంచలనం సృష్టించింది... తన  రాడాన్‌ సంస్ధలో ఎన్నో మెగా హిట్‌ సీరియల్స్‌ నిర్మించింది. తెలుగు తమిళ్‌ కన్నాడం ఇప్పుడు శ్రీలంకలో కూడా టీవీ సీరియల్‌ నిర్మిస్తోంది. తనకి తానే పోటీ.

యాంకర్‌.9
రాధిక గడ్డి పోచకాదు... వట వృక్షం కూడా కాదు...  తెలుగులో పిన్ని, ఇది కథ  కాదు... కలవారికోడలు లాంటి ఎన్నో సీరియల్స్‌తో మళ్లీ దగ్గరయింది. నటుడు రాజకీయవేత్త అయిన శరత్‌ కుమార్‌ను పెళ్లాడింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది... అది కూడా రాధిక స్టయిల్లోనే..

యాంకర్‌.10
రాధిక... అవును ఈ పేరు చలాకీతనానికి మారు పేరు... ఎన్నేళ్లయినా ఒకేలా వున్న రాధిక... ఒక ఓడి గెలిచిన యోధురాలు... సినిమాల్లో జీవితంలో కూడా...వియ్‌ లవ్‌ యూ... రాధికా... 
Once again Happy Birth day to you .

No comments:

Post a Comment