యాంకర్
ఆమె... కంటి చూపుతో... కోటి భావాలు పలకిస్తుంది. ఓర చూపు తెలుసు... కోర చూపూతెలుసు... చల్లని వెన్నెల్లా... ఆమె నటన సాగుతుంది. శివుడి తలపై గంగలా సెంటి మెంట్ సేన్‌లో... జీవిస్తుంది. ఏ హీరోయిన్‌ను అడిగినా ఆవిడే తనకు ఆరాధ్యమంటారు. నిండుతనం... తెలుగు దనం... ఆమె సొంతం. నటనకు తానొక పర్యాయపదం... ఆవిడే సావిత్రి. మహానటి సావిత్రి పుట్టినరోజునేడు.
యాంకర్.1
సావిత్రి... మంచి నటి... కాదు కాదు... మహానటి. అసలు నటనంటే ఏంటో తనను చూసి నేర్చుకోవాలి. మరి సావిత్రి ఎలా నేర్చుకుంది ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఈ అద్భుతనటి...తన పన్నెండేళ్ల వయసులోనే.. సంసారం సినిమాతో మొదటి సారి తెరపై కన్పించారు.
యాంకర్.2
సావిత్రి గారి నటన గురించి చెప్పాలంటే ఫలానా చిత్రంలో నటన బావుంటుందని చెప్పటం ఎవరి తరమూ కాదు. చెరకు గడ ఏ చోట తిన్నా తీయగానే వుంటుంది మరి. సావిత్రి నటనా అంతే.... పెళ్లి చేసి చూడు, అర్ధాంగి, చిత్రాలతో తన ఇమేజ్ పెరిగిపోయి మహానటిగా పేరు తెచ్చుకుంది.
యాంకర్.3
సావిత్రి నటించలేని పాత్రంటూ ఏదయినా వుందా... అని ఆలోచిస్తే... సమాధానం ఎన్ని జన్మలెత్తినా దొరకదు. మిస్సమ్మలో సావిత్రి పాత్రలో ఇంకెవరినైనా ఊహించగలమా....?
యాంకర్.4
తెలుగు చలన చిత్ర చరిత్ర గురించి ప్రస్తావిస్తే అందులో మాయబజార్ గురించి చెప్పకుండా వుండలేరు. అద్భుతమైన ఈ చిత్ర కథ మొత్తం సావిత్రి పాత్ర చుట్టే తిరుగుతుంది. సావిత్రి నటనంతా ఒకెత్తయితే.. ఘటోత్కచుడిలా నటించటం మరో ఎత్తు.
యాంకర్.5
అక్కినేని గారితో విషాదంలో పోటీ పడి నటించింది. NTR గారితో చిలిపిగా, ఆరిందలా... పెద్దరికంతో నటించినా... కన్నీళ్లుపెట్టినా ప్రేక్షకులచే కన్నీళ్లు పెట్టించినా... సావిత్రి గారికే చెల్లుతుంది.
యాంకర్.6
సుమంగళి, మూగమనసులు, తోడికోడళ్లు, మంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి, దొంగరాముడు... ఎన్ని సినిమాలు.... అన్నీ... అద్భుతమే.... నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా... సావిత్రి ఒక అధ్యాయాన్ని సృష్టించి వెళ్లింది. వాటిని మనం విధ్యార్ధుల్లా చదువుకోవటం మినహా చేసేదేం లేదు.... హ్యాపీ బర్త్‌డే మిస్సమ్మ.

No comments:
Post a Comment