Tuesday, 21 February 2012

పి.బి. శ్రీనివాస్

యాంకర్‌.1
``పి.బి.శ్రీనివాస్‌`` పేరు వింటే చాలూ కరుణ రస ప్రధానమైన సింధు భైరవి రాగానికి కొత్త శోభ వస్తూంది. హిందోళంలోని భక్తి, శృంగార, కరుణ రసాలు తమ ఆరోహణ ఆవరోహణ నియమాలను వదిలి ఆ ఆనందంలో దారి తప్పుతాయి. మోహన కల్యాణి, అభేరి రాగాలు కొత్త ఉత్సహంతో పరుగులెత్తుతాయి. ఆయన గళం విప్పితే కలం కొత్తపదాలు వెతుక్కోవలిసి వస్తూంది. కోకిల గొంతు మూగబోతుంది. పకృతి పరవశిస్తుంది. సాహిత్యానికి సంగీతానికి కొత్త వెలుగువస్తూంది. ఈ రోజు పి.బి. శ్రీనివాస్‌ పుట్టిన రోజు ఆయనకు పుట్టినకోజు శుభాకాంక్షలు అందించి గానాసుధను అస్వాదిదాం పదండి.

యాంకర్‌.2
వాగ్గేయ కారుడు అనే మాటకు సజీవ ఉదహారణ పి.బి. శ్రీనివాస్‌ పద్నాలుగు భాషల్లో గానాలాపన చేసి తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ హిందీ, ఉర్దూ భాషల్లో అశువుగా పద్యాలు పాటలు రాసి..... అలవోకగా గజర్స్‌ గీతాలు పాడే పి.బి. శ్రీనివాస్‌ 1951 - 1952 ప్రాంతాల్లో మిస్టర్‌ సంపత్‌ అనే చిత్తరంలో అప్పటికే ప్రముఖ గాయనీమణంలైన గీతాదత్‌, షంషాద్‌ బేగం, జిక్కి లాంటి వారితో కలిసి పాడి చిత్రసీమలో అడుగుపెట్టారు.

యాంకర్‌.3
మహు దూరపు బాటసారులు ప్రాపంచిక సుఖాలను వదిలి సర్వత్సంగా పరిత్యాగం చేసిన మనిపుంగవులు పండితులు, పామరులు పి.బి. శ్రీనివాస్‌ సాహిత్యాన్ని సంగీతాన్నీ ఆ వినసోంపైనా విలక్షణమైన, సోగసైన సరసమైన గళాన్ని విని ఆనందించేవారు. కాకినాడలో పుట్టి కన్నడిగులను మెప్పించిన ఈ వాగ్గేయకారుడు ఉత్తరాది,ధక్షిణాదిలోనూ రాసి, పాడి ప్రజల నీరాజనాలందుకున్నారు.

యాంకర్‌.4
శ్రీ వెంకటేశ్వరస్తోత్రం, శారదభుజంగ స్తోత్రం శ్రీ మల్లిఖార్జునస్తోత్రలను  కంపోజ్ చేసి భక్తి పారవశక్యంతో పాడి ప్రజలలో అద్యాత్మికత భావనను కలిగించిన పి.బి. శ్రీనివాస్ భలేరాముడు చిత్రంలో రెండూ పాటలను పాడారు

యాంకర్ : 5
ఒకే సంవత్సరంలో నాలుగు భాషల్లో గాయకుడిగా పరిచయమైన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న పి.బి. శ్రీనివాస్ తండ్రి వాదిస్తున్నా వినకుండా గానమే తన ఊపిరిగా జీవితాన్ని తిర్చిదిద్దుకున్న దిట్ట ఏ భాషలోనైనా అవలీలగా పాడి స్ధానిక గాయకులను సైతం మైమరిపించగల బహుముఖ ప్రజ్ఞాశాలి,

యాంకర్ 6
ప్రతివాదా భయంకర శ్రీనివాస్ గళం స్వర్ణగళంగా గుర్తింపు పొందిది. స్వర్ణగళంగా గుర్తింపు పొందింది. అయితే పి.బి శ్రీనివాస్ కన్నడ నట దిగ్గజం రాజ్‌కుమార్‌ కు ఎన్నో గీతాలు అలపించారు. ఫణింద్రస్వామి శేషగిరమ్మ దంపతులకు జన్మించిన ఆయన చలన చిత్ర నేపథ్య గాయకుడిగా ఎన్నో అవార్డులు అశేష సంగీతప్రియులు ప్రశంసలు అందుకున్నారు

యాంకర్‌ 7
ఎక్కడపాడిన ఏ రాగాలో పాడిన స్వరాలు మారవు. పి.బి. శ్రీనివాస్ గళ మాధుర్యం మారుదు అందుకే  ఆయన స్వరదిగ్గజం లక్షాలాది మంది శ్రోతల గుండెల్లో స్థానం సంపాదించుకున్న సంగీత సర్వతి ముద్దుల తనయుడు పి.బి. శ్రీనివాస్ గారికి అశువుగా పాడిన గజల్స్‌ మంచి పేరును చిరకాల కిర్తిని సంపాదించిపెట్టాయి.

యాకంర్ 8
దేశభక్తి గీతాలాపనలో పెద్దగా ప్రవేశం లేకపోయిన తన శ్రావ్యమైన సంగీతంలతో దేశభక్తిని రగింలిచగల పి.బి. శ్రీనివాస్ ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈ నాటి వాగ్గేయ కారుడు మన అదృష్టం

యాంకర్ 9
ఎకవీర, భలేరాముడు, సంపూర్ణరామయణం, ప్రేమించిచూడు, గుడి గంటలు, లవకుశ శ్రీసీతారా కళ్యాణం, ఇద్దరుమిత్రులు లాంటి దాదాపు 20 పైగా తెలుగు చిత్రాల్లో పాటలు పాడిన పి.బి. శ్రీనివాస్ పాటలన్నీ ఆణిముత్యాలే

యాంకర్ 10
పి.బి. శ్రీనివాస్ గారికి మరొక సారి బర్త్‌డే విషిష్ అందించి సెలవు తీసుకుందాం నమష్కారం

No comments:

Post a Comment