Tuesday, 21 February 2012

ఆశాభోంస్లే

యాంకర్‌.1
కోయిలలు సైతం... ఈర్షపడే కంఠం... స్వరాలకు తాను నిఘంటువు... క్వీన్‌ ఆఫ్‌మెలోడీ... అని పిల్చుకునే... ఆశాభోంస్లే గారి స్వర ప్రయాణంలో... ఒక సువర్ణధ్యాయం లిఖించబడింది. ఎక్కువగా సోలో పాటలు పాడిన గాయనిగా.. ఆమె గిన్నీస్‌బుక్‌ రికార్డులోకి ఎక్కారు అయితే.. అంతకు ముందుగానే ప్రపంచ సంగీత ప్రియుల హృదయాల్లో స్ధానం సంపాదించుకున్నారు. ఆ మహాగాయని స్వర ప్రయాణాన్ని తల్చుకుంటూ కాసేపు మనం సరిగమల్లో తడిసిపోదాం... మురిసిపోదాం.

1.ఆశాభోంస్లే గారు... గిన్నీస్‌ బుక్‌ రికార్డును స్ధాపించారు పదకొండువేల పాటలు పాడిన... ఆవిడకు అభినందనలు ఏ పాటతో తెలుపుతారు...?

2.గాయకులకు వుండాల్సిన మొదటి లక్షణం ఏంటి...?

3.అందరితో పోలిస్తే ఆశాగారి ప్రత్యేకతలు ఏంటి...?

4.ఆశాగారు అన్ని సంగీత ప్రకియల్లో తనదైన ముద్ర వేశారు... ఎన్నోభాషల్లో పాటలు, గజల్స్‌ భజన్స్‌,ఖవ్వాళీ, ఇంకా ఆల్బమ్స్‌ ఎక్కడైనా - ఆ స్వరం మంత్రముగ్దుల్ని చేస్తుంది - ఇదెలా సాధ్యం.

5.మొన్న మొన్న చందమామ చిత్రంలో పాడిన నాలో ఊహలకు పాట వింటే... ఆ గళానికి 78 వయసంటే నమ్ముతారా... ఆ పాట మా కోసం.

6.లతా మాగేష్కర్‌ గారి సోదరే అయినా ఇద్దరి సంగీత ప్రయాణంలో... మీరు గమనించిన వేరియేషన్స్‌ ఏంటి...?

7.ఆశాభోంస్లే గారు తెలుగులో అతి తక్కువగా పాడారు... చిన్నకృష్ణుడు, చిత్రంలో జీవితం...సప్తసాగర్‌ సంగమం... మాకోసం ఈ పాట.

8.ఎంత చక్కటి పాలు... చురాలియా హై తుకునే జోదిల్‌కో... ఆ పాటతో ఎంతో మంది హృదయాలను ఆశాగారు దొంగిలించారు.

9.అప్పట్లోనే పాస్ట్‌నంబర్‌ సాంగ్స్‌ వుండేవి ఇంతటి టెక్నాలజీ లేదు కాబటి ఒకే టేక్‌లో పాడాలి... పియతూ... అబ్‌తో బాహోమే ఆజా ఆ పాట వేరెవరయినా పాడగలరా.

10.దమ్‌మారో దమ్‌ అంటూ తన పాటతో భారతదేశాన్నే ఒక ఊపు ఊపేసిన ఆశాగారు ఫాస్ట్‌ బీట్‌ ఎక్కువగా పాడారని అన్పిస్తుందా...?

11. ఏక్‌ మై ఔర్‌ ఏక్‌తూ అన్నా... తన్‌హా తన్‌హా అని పాడినా తనకే చెల్లుతుందేమో...?

12.ముడ్‌ ముడ్‌కే నాదేఖ్‌ ముడ్‌ ముడ్‌కే....

13. ఓ మేరీ సోనారే..సోనారే...

14.జవానె జానెమన్‌ హసీకె దిల్‌రుబా

No comments:

Post a Comment