Tuesday, 21 February 2012

అంజలీదేవి

యాంకర్‌.1
ఆవిడ...నిత్య నూతన నటి అసలు సిసలు హీరోయిన్‌కు నిలువెత్తు నిదర్శనం... ఆవిడ సీతమ్మ ఆవిడ అనార్కలి  సడిసేయకే గాలి అంటూ పాడినా రాజశేఖరా నీపైమోజు తీరలేదురా అన్నా మధురంగా వుంటుందా నటన 1952లో హీరోయిన్‌గా కెరియర్‌ మొదలు పెట్టి ఇప్పటికీ నటిగా కొనసాగుతోంది ఆవిడ అలనాటి సీతమ్మ పాత్రధారి అంజలీదేవి ఆ అమృత మూర్తికి నేడు పుట్టిన రోజు.

యాంకర్‌.2
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో జన్మించిన అంజలీ దేవి సంగీతం నృత్యంలో శిక్షణ తీసుకుంది. కాకినాడ యాంగ్‌మెన్స్‌ హ్యపీ క్లబ్‌ తరపున నాటకాలు వేసే  అంజలీ దేవి ఓనాడు సన్నగా రివటలా చురుగ్గా వున్న ఓ అబ్బాయితో కలిసి రుక్మిణిగా నటించింది. ఆ తరువాత వాళ్లద్దరూ హీరో హీరోయిన్‌లుగా వెండితెరపై కన్పించారు ఆ అబ్బాయి పేరు అక్కినేని నాగేశ్వరరావు.

యాంకర్‌.3
అంజనీ కుమారి  పేరును సినిమాల్లో చేరాక అంజలీదేవిగా మార్చుకున్నారు ప్రముఖ సంగీత విధ్వాంసులైన ఆది నారాయణ రావు గారిని వివాహం చేసుకున్న అంజలీదేవి మద్రాసు చేరుకుని తన సినీ జీవితం మొదలెట్టంది 1947లో పి.పుల్లయ్యగారి చిత్రంలో దేవకర్యగా మొట్టమొదటి పాత్ర వేసింది.

యాంకర్‌.4
మొదట్లో అంజలీ దేవిగారు చిన్న చిన్న పాత్రలే ధరించారు తుఫానుకు ముందు చిరుజల్లులు తాంపరలు పడ్డట్టుగా ఈ మహానటి కొన్ని చిన్నచిత్రపాత్రల తరువాత పల్లెటూరి పిల్ల చిత్రం ద్వారా హీరోయిన్‌గా నటించింది ఈ చిత్రంలో ANR NTR లు నటించటం విశేషం.

యాంకర.5
అంజలీ దేవి నటించిని పాత్ర అంటూ లేదంటే అతిశంచక్త కాదు తన వయసుకు మించిన పాత్రల్ని కూడా ఆ రోజుల్లోనే నటించి మెప్పించారు చిత్రరంగంలో తొలి తెలుగు గ్లామర్‌ నాయిక అంజలీ దేవే ఆ రోజుల్లోనే అంజలీ దేవి అక్షరాలా ముప్పయ్‌వేల రూపాయలు పారితోషకం తీసుకున్న దాంటే ఆవిడెంత బిజీ క్రేజ్‌వున్ననటో అర్ధం చేసుకోవొచ్చు.

యాంకర్‌.6
మలేషియా, సింగపూర్‌ లాంటి దేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తూ గొప్పలకు పోతున్నారు నేటి తరం వారు. అయితే ఒక తెలుగు చిత్రం కాశ్మీర్‌లో షూటింగ్‌ జరుపుకోవటం మొదలైంది మాత్రం అంజలీ దేవి ANR నటించిన అల్లావుద్దీన్‌ అద్భుతదీపం చిత్రంతోనే ఇది జరిగింది 1957లో అంటే నమ్మగలరా...?

యాంకర్‌.7
తొలి గ్లామర్‌ హీరోయిన్‌ అంజలీ దేవి అయితే తొలి స్టార్‌ హీరోయిన్‌ మాత్రం సావిత్రే సావిత్రి లాంటి హీరోయినే అంజలీ దేవికి ఏకలవ్య శిష్యురాలని ప్రకటించింది. తెలుగువారికి సీతమ్మ తల్లిగా లవకుశలోని అంజలీదేవిని మరువగలరా తెలుగువారు.

యాంకర్‌.8
తెలుగు తమిళ్‌ హిందీ చిత్రాల్లో నటించింది NTR నటించిన తొలి హిందీ చిత్రం నయా ఆద్మీలో అంజలీదేవి గారే నాయికనిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు 1950 - 51 వ సంవత్సరానికి దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి ఉపాద్యక్షురాలిగా పనిచేసింది. దక్షణ బారత చలన చిత్ర కళాకారుల సంఘానికి అధ్యక్షురాలిగా వ్యవహరించింది.

యాంకర్‌.9
అనార్కలి, సువర్ణ సుందరి బడిపంతులు స్వర్ణమాజరి, సతీసుమతి తాతామనవాడు సతీ సక్కుబాయి...
భక్తతుకారాం మహాకవి క్షేత్రయ్య చండీ ప్రియ లాంటి హిట్‌తో పాటుగా దాదాపుగా నాలుగొందాల చిత్రాల్లో నటించినా అంజలీదేవికి మాత్రం మూడే చిత్రాలట లవకుశ, ఇలవేలుపు రంగుల రాట్నం.

యాంకర్‌.10
అంజలీ దేవి గొప్పతనం గురించి చెప్పటానికి కాదుగానీ సందర్భంగా ఓ మాట చెప్పక తప్పదు. 1956వ సంవత్సరంలో ప్రెసిడెంట్‌ హేర్‌ ఆయిల్‌, టాల్కం పౌడర్‌కు అంజలీదేవి గారు యాడే చేశారు ఆ విడ ఫోటోతో ప్రకటనలు వొచ్చాయి.

యాంకర్‌.11
సినీ జీవితంలో ఎన్నో వొడిదుడుకులు ఎదుర్కోన్న అంజలీ దేవి గారు పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు బాబా అంటే ఎనలేని అభిమానం అంజలీదేవి ఇద్దరు సంతానమైన నింజన్‌ చిన్నారావులు అమెరికాలో స్ధరపడ్డారు. నేటి తరమే కాదు ఏ తరానికైనా నటనకు పెద్దబాల శిక్షలాంటి అంజలీదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవంతుడు ఆవిడకు ఆయురారొగ్యఐశ్వర్యాలతో పాటు ప్రశంతమైన జీవన్నాని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు నమస్కారం.

No comments:

Post a Comment