Tuesday, 21 February 2012

కమల్‌ హసన్‌

యాంకర్‌ ;
అతనొక నటుడు... నడిచే నట విశ్వవిద్యాలయం... ఒక నటుడు ఏం చేయాలో అన్నీ చేశాడు...అతన్ని చూస్తే అందరికీ ప్రయోగాలు చేయాలన్పిస్తుంది. నటనతో తెరపై  ఇంద్రధనుస్సు పూయిస్తాడు... కన్నీరు పెట్టిస్తాడు...  దాన్ని నటన అనలేము... ఎందుకంటే... అలా ఇంకో నటుడు నటించలేడు కనుక... అతడు నిఘంటువు... అతడు...ఒక ముడి పదార్ధం నటనతో జడపదార్ధాన్ని కూడా...కరిగింపగలడు... అతడే కమల్‌హసన్‌... అతడు అందరికీ... అభిమాన హీరో... అసలు హీరో అంటేనే అతడేమో...కమల్‌ హసన్‌కు నేడు పుట్టిన రోజు.

యాంకర్‌.1
ఒక ఇంజనీర్‌ను తయారు చేయగలం ఒక డాక్టర్‌ను తయారుచేయగలం కానీ ఒక నటుణ్ణి తయారు చేయగలమా... చేయలేమా... ఎందుకంటే... ఒక కమల్‌హసన్‌ని ఎవరూ తయారు చేయాలేదు కనుక కమల్‌, సెల్ప్‌ మేడ్‌, మ్యాన్‌ శిలనే తనని శిల్పంగా మార్చుకుంది. ఆ శిల బాలనటుడిగా ఆ రేళ్ల వయసులోనే రంగప్రవేశం చేశాడు.

యాంకర్‌.2
కమల్‌ హసన్‌ తండ్రి శ్రీనివాసన్‌, తల్లి రాజ్యలక్ష్మీ తండ్రికి ఆప్తుడైన స్నేహితుడు హసన్‌...ఆత్మీమతకు గుర్తుగా... తన పిల్లల పేర్లకు చివరన హసన్‌ అని పేరు పెట్టారు. ఈ అపురూపనటుడు మరో అపురూప దర్శకుడి దృష్టిలో పడ్డాడు... ఈ దర్శకుడు భారతీరాజా వీరి కలయికలో పదహారేళ్ల వయసు సెన్సేషన్‌ అయ్యింది.

యాంకర్‌.3
యాక్షన్‌ అని దర్శకుడు అనగానే కమల్‌ నటన మొదలైతే... అతని నటనలో యూనిట్‌ మైమరిచి పోతుంది... కట్‌ చెప్పటం కూడా... మర్చిపోయి దర్శకుడు చూస్తూంటాడు... అది నటనంటే... అదే నటనంటేనేమో కమల్‌ ఆల్‌రౌండర్‌... మంచి నృత్యాకారుడు... మొదట డాన్స్‌ డైరెక్టర్‌గా కెరియర్‌ మొదలెట్టి... అన్నింట్లోనూ... ఆరితేరాడు.

యాంకర్‌.4
కమల్‌ హసన్‌ చేసినన్ని డిఫరెంట్‌ పాత్రల్ని ఎవరూ చేయలేదేమో... చేయలేదేమో...  నాయకుడు చిత్రంలో కమల్‌ నటన ఉవ్వెత్తున ఎగిసింది.

యాంకర్‌.5
పుష్పక విమానం అనే సినిమా సంగీతం శ్రీనివాసరావు గారు ఆలోచించారు... ఆ పాత్రకేవలం కమల్‌ హసన్‌ మాత్రమే చేయాలి... చేశాడు. ఒక్క మాటా వుండదు... అయినా సినిమా అద్భుతం.

యాంకర్‌.6
సాగర సంగమంలో కమల్‌ నాట్యం నటన... తాగుబోతు ఇలా అన్ని షేడ్స్‌ కలిపి ఒక కోత్త వొరవడిని మొదలెట్టాడు... ఈ చిత్రంలోని కమల్‌ని ఎవరూ మరవలేరు... అసలు కమల్‌ విశ్వనాధ్‌ల కాంభినేషన్‌లో... సినిమా వొస్తుందంటేనే ప్రేక్షకులకు విస్తరిలో వడ్డించిన ఫుల్‌మిల్స్‌తో సమానం.

యాంకర్‌.7
మరుగుజ్జ పాత్రలో కమల్‌ విశ్వరూపమే... చూపాడు... అందులో ద్విపాత్రాభినయం చేసినా... మరుగుజ్జ పాత్రం చూస్తే...దాన్ని నటన అనాలో ఇంకే మనాలో అర్ధంగాదు.

యాంకర్‌.8
ప్రేమ చిత్రాలు చాలా మంది చేశారు. అయితే కమల్‌ గుణ చిత్రంలో ఉన్మాద ప్రేమికుడిగా మతి చలించిన వాడిగా కన్పిస్తాడు. ఒక మనిషిలో ఏదో ఒక లోపం కన్పిస్తుంది అయితే కమల్‌లో ఏలోపమూ దొరకదు.

యాంకర్‌.9
ఇంద్రుడు చంద్రుడులో మరో అవతారమెత్తాడు... ఎత్తుపళ్లతో లంచగొలడిగా కన్పిస్తాడు గతంలో కళ్యాణ రాముడు చిత్రంలో కూడా ఇలాగే ఎత్తు పళ్లతో కన్పించి ఆ చిత్రాన్ని అద్భుత చిత్రరాజంగా నిలిపాడు మళ్లీ చాలా రోజులకు ఇంద్దుడు చంద్రుడుతో తనకు తానే పోటీ అయ్యాడు.

యాంకర్‌.10
కమల్‌ నటన చూస్తోంటే ఇతనికి చాతగాని పాత్ర ఏదయినా వుందా అని ఆలోచించాల్సి వుంటుంది... అయితే... సమాధానం ఈ జన్మకు దొరకదేమో... క్షత్రీయ పుత్రుడు చిత్రంలో కమల్‌ నటనను పోగట్టానికి భాష సరిపోతుందా.

యాంకర్‌.11
నటుడు జీవితంలో ఒక్కసారయినా కమల్‌ లాంటి పాత్ర ఒక్కటి చేస్తే చాలాని అనుకుంటారు... అయితే చాలామందికి. అది కలగానే నిలిచిపోతుంది. మహానదిలో కమల్‌ని మనం మరువగలమా.

యాంకర్‌.12
కమల్‌ డాన్స్‌ డైరెక్టర్‌గా... నటుడిగా డైరెక్టర్‌గా ప్రోడ్యూసర్‌గా... గాయకుడిగా రైటర్‌గా... ఇంకా అన్ని శాఖల్లోనూ అద్భుతంగా రాణించాడు. సతీలీలా వతిలో కామెడీ చేసినా హారతీయుడులో సేనాపతిగా ముసలి పాత్రలో కన్పించినా అతనికి మాత్రమే సాధ్యం.

యాంకర్‌.13
కమల్‌ అన్న చారూహసన్‌ కెమెరామెన్‌గా నటుడిగా వున్నాడు. అతని కూతురు సుహాసిని గాప్ప నటిగా పేరు తెచ్చుకుంది. సుహాసిని భర్త మణిరత్నం ఒక గొప్ప దర్శకుడు వీరు నటుగురూ జాతీయ అవార్డులు పొందటం విశేషం.

యాంకర్‌.14
భామనే సత్య భామనే అంటూ స్త్రీ వేషంలో కన్పించినా... ద్రోహిలో పోలీస్‌ ఆఫఅసర్‌గా ఖాకీ డ్రెస్సులో నటించినా మైకేల్‌ మదన కామరాజులో నాలుగు పాత్రలు నమిలి మింగేసినా, మరో చిరిత్రలో చరిత్ర సృష్టించినా... కమల్‌ మాత్రమే చేయగలడు... అతను మాత్రమే..నటించగలడు.

యాంకర్‌.15
దశావతారాలు చిత్రంతో కమల్‌ చేసిన ప్రయోగం మరో అద్భుతం... ఇందులో పది పాత్రల్లో వైవిధ్యంగా మలచటం నటించటం అంత ఈజీకాదు... ఈ చిత్రం బహుభాషల్లో విడుదలైంది... కమల్‌హసన్‌లా ఒక నటుడు ఇన్ని వైవిధ్యమైన పాత్రల్ని ధరించటం ప్రపంచ సినీ చరిత్రలో జరగదేమో.

యాంకర్‌.16
కమల్‌ హసన్‌ వ్యక్తిగత జీవితం కాస్త విచిత్రంగా వుంటుంది. వాణి గణపతితో వివాహ బంధం తెగిపోయాక సారికను పెళ్లాగాగు. అయితే సారికకు కూడా సారీ చెప్పి గౌతమితో జహజీవనం చేస్తున్నాడు. శృతి అక్షర...కమల్‌ కూతుళ్లు... అయితే శృతి హసన్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. కమల్‌ విలక్షణ నటుడు... అసలతను నటుడే కాదు... ఒక నట విశ్వవిద్యాలయం పుట్టిన రోజు శుభాకాంక్షలు.

No comments:

Post a Comment